ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా రోజు రోజుకు పెరుగుతున్న వ్యాధి ఏంటి అంటే డయాబెటిస్ అనే చెప్పచ్చు. అయితే ఈ డయాబెటిస్ వల్ల మనిషి మరణించకపోయినప్పటికీ ఈ వ్యాధికి ఎప్పటికప్పుడు చికిత్స తీసుకుంటూనే ఉండాలి.. ఎన్ని సహజసిద్ధమైన చిట్కాలు ఉపయోగించినప్పటికీ ఇది తగ్గదు. దీంతో డయాబెటిస్ కు ఎప్పటికప్పుడు చికిత్స తీసుకోవాలి. 

 

దీంతో ప్రవాసుల మెడికల్ చికిత్సకు అధిక ఖర్చు అవుతోందని భావిస్తున్న కువైట్ ప్రభుత్వం ఈ భారాన్ని తగ్గించుకునేందుకు తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే టీబీ, హెపటైటిస్ బీ అండ్ సీ, హెచ్ఐవీ, ఎయిడ్స్ వంటి వ్యాధులు కలిగి ఉన్న ప్రవాసులకు కువైట్‌లో ఉద్యోగం చేయడానికి, నివాసముండటానికి అనర్హులంటూ గతంలో కువైట్ ప్రకటించేసిన సంగతి తెలిసిందే. 

 

అయితే తాజాగా ఈ జాబితాలోకి డయాబెటిస్‌ని ఒకటి చేర్చేసింది. ఒక్క డయాబెటిస్ నే కాదు దీంతో పాటు మరికొన్ని వ్యాధులను కూడా అందులో చేర్చినట్టు ఆరోగ్యశాఖ ప్రకటించింది. తాజా నిర్ణయంతో డయాబెటిస్ ఉన్న ప్రవాసులు కువైట్‌‌లోకి ప్రవేశించకుండా ప్రభుత్వం అడ్డుకట్ట వేసినట్లయింది. 

 

ఈ మేరకు కొత్త వ్యాధుల జాబితాను త్వరలోనే అమలు చేయనున్నట్టు ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ ఫహాద్ అల్ గుమ్లాస్ తెలిపారు. ప్రవాసులు మెడికల్ చికిత్సకు సంబంధించి ఎప్పటికప్పుడు తాము జాబితాను అప్‌డేట్ చేస్తుంటామని ఆయన అన్నారు. అయితే డయాబెటిస్‌తో పాటుగా జాబితాలో చేర్చిన ఇతర వ్యాధుల పేర్లను చెప్పడానికి డాక్టర్ ఫహాద్ నిరాకరించారు. 

 

అధికారికంగా నిర్థారించిన తర్వాతే ఇతర వ్యాధుల పేర్లను ప్రకటిస్తామని అయన తెలిపారు. కాగా ఇదిలా ఉండగా, అనేమియా వంటి తక్కువ ఖర్చుతో కూడుకున్న వ్యాధులను జాబితా నుంచి తొలగిస్తున్నట్టు అయన తెలిపారు. అయితే ఉపాధి నిమిత్తం కువైట్ కి వెళ్లే ప్రవాసులు ఇది షాకింగ్ విషయం అనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: