ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య , మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోన్న విషయం తెలిసిందే. కరోనా పంజా విసురుతుండడంతో గతంతో పోలిస్తే శానిటైజర్ల వినియోగం భారీగా పెరిగింది. శానిటైజర్లు, వైద్య పరికరాలు, వ్యక్తిగత రక్షణ దుస్తుల కొరత వైద్యులను, సామాన్య ప్రజలను తీవ్రంగా వేధిస్తోంది. జపాన్ లో శానిటైజర్ల వినియోగం భారీగా పెరగడంతో అక్కడి ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. 
 
అక్కడి ఆసుపత్రులకు, ప్రజలకు ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. శానిటైజర్లు అందుబాటులో లేని ప్రాంతాల్లో మద్యంతో చేతులు కడుక్కోవాలని ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. జపాన్ లాంటి అగ్ర దేశాలలో ప్రతి విషయంలోను అక్కడి ప్రభుత్వం బాధ్యతగా నిర్వర్తించుకోవాలనుకుంటుంది. గతంతో పోలిస్తే ఇక్కడ పది రెట్లు శానిటైజర్ల వినియోగం పెరిగింది. ఇప్పటికప్పుడు శానిటైజర్ల ఉత్పత్తిని పెంచడం కంటే ప్రత్యామ్నాయాలను వినియోగించడం మంచిదని ఆ దేశ ప్రభుత్వం భావించింది. 
 
జపాన్ వైద్య ఆరోగ్య శాఖ 70 నుంచి 83 శాతం మధ్య ఆల్కహాల్ ఉన్న మద్యాన్ని శానిటైజర్లకు బదులుగా వినియోగించాలని మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రభుత్వం సూచించిన స్థాయిలోనే కొన్ని వోడ్కాలలో ఆల్కహాల్ శాతం ఉందని సమాచారం. అయితే జపాన్ దేశపు సంప్రదాయ పానీయాలైన సాకీ, సోచూల్లో మాత్రం అత్యధికంగా 45 శాతం ఆల్కహాల్ మాత్రమే ఉంటుందని తెలుస్తోంది. ప్రభుత్వం సూచనలతో ఆక్కడ స్థానిక డిస్టిల్లరీలు రంగంలోకి దిగి ఆల్కహాల్ శాతం ఎక్కువగా ఉండే మద్యాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: