అవును.. నిజంగానే ఫేస్ బుక్ సీఈఓ అమెరికన్లను రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు. ప్లీజ్ అంటూ సోషల్ మీడియా వేదికగా అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఎందకు? ఏమిటి అని అనుకుంటున్నారా? అదేనండి.. అమెరికాలో కరోనా వైరస్ దారుణంగా విజృంభిస్తుంది కదా! అందుకే మార్క్ జుకర్ బర్గ్ అమెరికన్లను రిక్వెస్ట్ చేస్తున్నాడు. 

 

 

కరోనా వైరస్ అగ్రాజ్యం అయినా అమెరికాలో తగ్గినట్టే తగ్గి మళ్లీ ఉగ్ర రూపం దాల్చింది. అందుకే ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జూకర్ బర్గ్, ఆయన సతీమణి ఇన్‌స్టాగ్రాం వేదికగా మాస్క్ ధరించాలంటూ ప్రజలకు సూచిస్తున్నారు. మాస్క్ ధరించి భార్యతో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేస్తూ.. ''దయచేసి మాస్క్‌ను ధరించండి. అమెరికాలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తోంది. దేశంలో ఆంక్షలు విధించకుండా, ప్రజలు ఆరోగ్యంగా ఉండే విధంగా మాస్క్ సహాయం చేస్తుంది'' అంటూ వ్యాఖ్యానించారు. 

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Please wear a mask. Covid is spreading quickly again and masks help keep people healthy and keep the country open.

A post shared by Mark Zuckerberg (@zuck) on

 

అయితే అమెరికాలో రోజుకు 40వేలకుపైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కొన్ని వేలమంది ప్రాణాలు విడుస్తున్నారు. ఇప్పటి వరకు 27.51లక్షల మంది కరోనా బారినపడగా అందులో 1.30లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ కరోనా కేసులు పెరగడంపై  అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా సీరియస్ అయ్యారు. తనకు చైనాపై రోజురోజుకీ కోపం పెరిగిపోతోందంటూ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: