యావత్ ప్రపంచాన్ని కంటికి కనిపించని ఒక వైరస్ గత రెండు సంవత్సరాల నుండి ఎంత ఇబ్బంది పెట్టిందో మనము కళ్ళారా చూశాము. కోట్ల మంది కరోనా బారిన పడగా, లక్షల మంది ఆ మహమ్మారి తీవ్రతకు బలైపోయారు. ఈ సమయంలో భారత్ లో ప్రజలు అనుభవించిన కష్టాలు వర్ణనాతీతం అని చెప్పాలి. హాస్పిటల్స్ లో సరైన వైద్య పరికరాలు, మెడిసిన్స్, బెడ్స్ లాంటివి అందుబాటులో లేకుండా నరకం అనుభవించారు. ఇటువంటి క్లిష్టమైన సందర్భంలో అనేక స్వఛ్చంద సంస్థలు సహాయం చేయడానికి ముందుకొచ్చాయి. సోనూ సూద్ లాంటి వారు సైతం తమ సొంత ఆస్తులను కరిగించి ప్రజల కష్టాల్లో పాలు పంచుకున్నారు.

ఇప్పుడు ఇదే విధంగా అమెరికాకు చెందిన యూనిసెఫ్ భారత్ కు సహాయం చేసేందుకు ఫండ్స్ కలెక్ట్ చేయడానికి పూనుకుంది. అయితే ఫండ్ రైజింగ్ కార్యక్రమంలో అమెరికాలో ఉన్న ఇండియన్ అమ్మాయి హాసిని (11 సంవత్సరాలు) సూర్య దేవర తన వంతు సహాయం చేస్తోంది. ఒక అమెరికా నుండే కాకుండా ఇతర దేశాల నుండి కూడా ఫండ్స్ ను కలెక్ట్ చేయడానికి నిర్ణయించుకుంది. ఆ పాప తన తమ్ముడితో కలిసి GoFundMe ఆన్లైన్ ట్యాగ్ ద్వారా విరాళాలను కలెక్ట్ చేస్తోంది. ఇంత చిన్నవయసులోనే తనకున్న మనసుకు హాట్స్ ఆఫ్ చెప్పాలి. హసిని ఇలా చేయడం ఇదేమి మొదటి సారి కాదు.


ఇంతకు ముందు వరదల సమయంలో కూడా విరాళాల కోసం ప్రయత్నించారు. ఈ విధంగా ప్రజా సేవ చేస్తున్న 108 మందిని యూత్ అమెరికా సర్వీస్ గుర్తించింది. ఈ 106 మందిలో హాసిని కూడా ఒకరు కావడం విశేషం. ప్రస్తుతం హాసిని చేస్తున్న పని పట్ల అందరి నుండి మద్దతు పెరుగుతోంది. ఈమె చేసే ఈ సహాయ కార్యక్రమానికి అండగా నిలవాలని కోరుకుంటున్నారు. ఈ విషయాన్నీ గమనించిన భారతీయులు హాసిని ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: