ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు తమ పెళ్లి ఎంతో అంగరంగ వైభవంగా చేసుకోవాలని అనుకుంటున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక తెలిసీ తెలియని బంధు మిత్రులందరికీ కూడా వివాహానికి ఆహ్వానించి అంగరంగ వైభవంగా ముస్తాబైన పెళ్లి మండపంలో వివాహ వేడుకలు జరుపుకోవాలని అనుకుంటున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో కేవలం ఒకే సారి వచ్చి ఒక మధురమైన జ్ఞాపకం కాబట్టి ఇక పెళ్లి విషయంలో ఎవరూ ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. సంపన్నులు మాత్రమే కాదు సామాన్యులు సైతం పెళ్లి వేడుకలు ఘనంగా నిర్వహిస్తూ ఉండడం గమనార్హం.


 అంతేకాదు ఇక తమకు నచ్చిన వారిని ఎంచుకుని పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెడుతూ ఉంటారు. ఇటీవలి కాలంలో అయితే ఎంతో మంది వధూవరులు పెళ్లి మండపం లోకి డాన్సులు చేస్తూ ఎంట్రీ ఇస్తున్న వీడియోలు ఎంతో వైరల్ గా మారిపోతున్నాయి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇలా పెళ్లి అంటే వధూవరుల తో పాటు బంధువులు వేడుకలు పురోహితుల మంత్రాలు బాజాభజంత్రీలు మరో వైపు నుంచి ఫోటో షూట్లు ఇలా ఎంతో హడావిడి ఉంటుంది.ఇక్కడ కూడా ఇలాంటి హడావిడి అంతా ఉంది కానీ ఒక వరుడు మాత్రం లేడు.

షాక్ అవుతున్నారు కదా.. వరుడు లేకుండా పెళ్ళి జరగడం ఏంటి అక్కడ ఏమైనా సినిమా షూటింగ్ చేస్తున్నారా లేకపోతే మీరు జోక్ వేస్తున్నారా అని అనుకుంటున్నారా.. నేను చెప్పేది జోక్ కాదు సినిమా షూటింగ్ అంతకన్నా కాదు నిజంగా జరిగిన ఘటనె. ఇటీవల ఓ యువతి వరుడిని కాకుండా తనని తానే పెళ్లి చేసుకుంది. వేరే వ్యక్తులను కాదు తనను తాను ప్రేమించుకుంటున్నానని జీవితాంతం ఒంటరిగా ఉంటాను అంటూ చెబుతూ ప్రమాణం చేస్తూ పెళ్లి ఉంగరాన్ని తనే తన చేతికి పెట్టుకుంది. జపాన్లో పదేళ్ల క్రితం మొదలైన ఈ ట్రెండ్ ఆస్ట్రేలియా ఇటలీ తైవాన్ అమెరికా దేశాల్లో వేగంగా పాకిపోయింది. భాగస్వామి చేతిలో మోసపోయిన వారు పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న వారు ఇలా సోలో వెడ్డింగ్ కి సిద్దమవుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: