గత కొంతకాలం నుంచి గూగుల్ కంపెనీ తమ ఉద్యోగులకు ఊహించిన షాక్ లు ఇస్తూ ఉంది అని చెప్పాలి. గూగుల్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది భారీగా ప్యాకేజ్ కూడా ఉంది.  దీంతో ఇక వచ్చిన శాలరీ తో హాయిగా జీవించొచ్చు అని భరోసాతో ఉన్న ఉద్యోగులందరి గుండెల్లో ఇక గూగుల్ నిర్ణయాలు గుబులు పుట్టిస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఎప్పుడు ఎవరి ఉద్యోగం ఊడిపోతుంది అన్నది కూడా ఊహకంగానే మారిపోయింది.


 ఈ క్రమంలోనే తమ ఉద్యోగానికి భరోసా లేదని తెలిసినా కూడా ప్రతిరోజు భయం భయంగానే.. ఇక జాబ్ చేయడానికి వెళుతూ ఉన్నారు. ఎంతోమంది ఉద్యోగులు ఇలా ఇటీవల కాలంలో గూగుల్ ఎంతోమంది ఉద్యోగులను జాబ్ నుంచి పీకేస్తూ ఉండడంతో చాలామంది జీవితాలు రోడ్డున పడుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక ఇటీవల ఏకంగా భార్యాభర్తలు ఇద్దరినీ కూడా ఒకేసారి ఉద్యోగం నుంచి తీసేసి షాక్ ఇచ్చింది గూగుల్. ఇటీవల హెచ్ఆర్ గా పనిచేస్తున్న ఉద్యోగిని సైతం జాబ్ నుంచి పీకేసి టూరిస్ట్ ఇచ్చింది గూగుల్  అని చెప్పాలి. ఇతర ఉద్యోగులను ఇక సంస్థలోకి తీసుకునేందుకు హెచ్ఆర్ ఏకంగా ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాడు.


 ఇక ఇలాంటి సమయం లోనే ఏకంగా అతని ఉద్యోగాన్ని తీసేసింది గూగుల్. సంస్థలో పని చేసేందుకు హెచ్ఆర్ ఉద్యోగం చేస్తున్న టైం లోనే చివరికి ఉద్యోగం కోల్పోయాడు డాన్ లాన్ అనే వ్యక్తి. అతని మొబైల్ కి మెసేజ్ వచ్చింది. అతను ఫోన్లో ఇంటర్వ్యూ చేస్తుండగా.. ఒకసారి కాల్ కట్ అయ్యింది. వెబ్సైట్లో మళ్ళీ లాగిన్ చేయాలి అనుకున్నప్పటికీ కుదరలేదు. ఏంటా అని ఒకసారి చెక్ చేసుకుంటే జాబ్ నుండి చివరికి తొలగిస్తున్నట్లు మెసేజ్ రావటంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు.  ఇక ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: