ప్రస్తుతం పాకిస్తాన్ లో ఏర్పడ్డ ఆర్థిక సంక్షోభం ఎంత దారుణంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే అక్కడ పరిస్థితులు రోజురోజుకు దిగజారి పోతున్నాయి అన్న విషయం తెలిసిందే. దీంతో ప్రజల జీవన శైలి కూడా పూర్తిగా దెబ్బతింటుంది. ఇక ద్రవ్యోల్బణం కారణంగా ప్రస్తుతం నిత్య అవసరాల ధరలు కూడా రెక్కలు వచ్చి ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయ్. ఈ నేపథ్యంలో  అంతంత  మాత్రమే ఆదాయం ఉన్న సామాన్య ప్రజలు తీవ్ర  ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. నిత్యవసరాల సరుకులు మాత్రమే కాదు చికెన్ మటన్ పెట్రోల్ లాంటివి కూడా ధరలు బగ్గుమంటున్నాయ్ అని చెప్పాలి.


 ముఖ్యంగా పాకిస్తాన్లో లీటర్ పెట్రోల్ ధర 272 రూపాయలకు చేరడం గమనార్హం. దీంతో వాహనదారులందరూ కూడా తమ వాహనాన్ని బయటకు తీయాలంటేనే భయపడిపోతున్నారు. అత్యవసరం అయినా కూడా వాహనాన్ని బయటకు తీసే ధైర్యం చేయడం లేదు అని చెప్పాలి. ఇక ఇలా భారీగా పెరిగిన ధరలతో ఆ దేశ పౌరులు అందరు కూడా ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే పాకిస్తాన్ క్రికెట్లో మ్యాచ్ ఓడిపోయినప్పుడల్లా ఆ దేశ అభిమానులు టీవీలను బద్దలు కొట్టడం ఇప్పటివరకు సోషల్ మీడియాలో ఎన్నోసార్లు చూసాం. కానీ ఇక్కడ మాత్రం ఇక పెట్రోల్ రేట్లు భారీగా పెరిగిపోవడంతో ఆగ్రహాన్ని అనుచుకో లేకపోయినా ఒక వాహనదారుడు ఏకంగా తన వాహనాన్ని తానే ధ్వంసం చేసుకున్నాడు.


 అంతేకాదు తర్వాత తన వాహనాన్ని పక్కనే ఉన్న పొలంలో కూడా తోసేసాడు అని చెప్పాలి. ఇక ఇందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉండడంతో ఎంతోమంది నెటిజెన్స్ ఇది చూసి షాక్ అవుతున్నారు. అయితే పాకిస్తాన్లో నెలకొన్న పరిస్థితులతో అక్కడ ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారు అన్నదానికి ఈ వీడియో నిలువుటద్దంగా మారిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతేకాదు ఇక పాకిస్తాన్లో ఉన్న నిత్యవసరాలు ధరలు చూసి ప్రస్తుతం పక్క దేశాల ప్రజలు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: