మనిషి కోతి నుంచి వచ్చాడు.. గొరిల్లా చింపాంజీలను చూసినప్పుడల్లా ఇది నిజమే అనే భావన ప్రతి ఒక్కరికి కూడా కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనుషుల్లాంటి ప్రవర్తన తీరును కలిగి ఉంటాయి ఈ రెండు జంతువులు. వాటి అలవాట్లు ప్రవర్తన హావభావాలు పండించే తీరు కూడా మనుషులను పోలి ఉంటుంది అని చెప్పాలి. అయితే ఇక కొన్ని కొన్ని ఘటనలు చూస్తే కేవలం అలవాట్లు ప్రవర్తన మాత్రమే కాదు మనుషుల్లాగానే గొరిల్లాలు చింపాంజీలు కూడా మానవత్వాన్ని జాలి దయ గుణాన్ని కలిగి ఉంటాయి అనే భావన ప్రతి ఒక్కరికి కూడా కలుగుతూ ఉంటుంది.


 ఇక ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినదే అని చెప్పాలి  సాధారణంగా జూలో గొరిల్లా ఉన్న ఎన్క్లోజర్ లో ఎవరైనా గుర్తుతెలియని వ్యక్తులు వెళ్లారు అంటే ఇక వారిని చంపేంత వరకు కూడా వదలవు గొరిల్లాలు. ఇక గొరిల్లాలకు ఉండే శక్తితో ఎంతో సులభంగా మనిషి ప్రాణాలు తీయగలవు. కానీ ఇటీవలే ఒక బాలుడు గొరిల్లా ఎన్క్లోసర్లో పడిపోతే అతని విషయంలో ఎంతో జాలి దయా హృదయంతో వ్యవహరించింది గొరిల్లా. బింటూ జువా అనే గోరిల్లా ఎన్ క్లోజర్ లోకి వచ్చిన పిల్లాడిని రక్షించి తన కరుణను చాటుకుంది అని చెప్పాలి.


 ఎన్క్లేజర్ లో పడిపోయిన పడిపోయిన బాలుడిని రక్షించి ఎలాంటి హాని చేయకుండా జూ కీపర్ లకు అప్పగించింది. దీంతో ఇక ఆ గొరిల్లా పై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురిపిస్తుంది.  జూకి వెళ్లిన ఎనిమిదేళ్ల బాలుడు తన తల్లి నుంచి తప్పిపోయాడు. అతను కంచపైకి ఎక్కి ఏడు గొరిల్లాలు నివసించే ప్రదేశంలో పడిపోయాడు. అయితే 20 అడుగుల ఎత్తులో నుంచి పడిపోవడంతో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. చేయి కూడా విరిగింది. అయితే సాధారణంగా కొత్తగా ఎవరైనా కనిపించారంటే గొరిల్లాలు వారిపై దాడి చేస్తాయి. కానీ  జువా అనే గొరిల్లా పిల్లవాడిని బాధించలేదు. ఆ గొరిల్లా అప్పటికే ఒక గొరిల్లాకు జన్మనిచ్చింది. తన పిల్లలను ఎలా చూసుకుందో.. ఆ అబ్బాయి దగ్గరికి వెళ్లి అతని కూడా అలాగే చూసుకుంది. అతన్ని మెల్లిగా పట్టుకుంది. ఇక జూ కిపర్స్ చూడగలిగే సహాయం చేయగలిగే స్థలం వైపుకు తీసుకెళ్లి అక్కడ అతన్ని కూర్చోబెట్టింది. తర్వాత మిగతా గొరిల్లాల దగ్గరికి వెళ్లి కూర్చుంది. దీంతో జూకిపర్స్ బాలుడిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ఇక ఇలా జాలి దయ గుణం చాటుకున్న గొరిల్లా పై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు ఎంతోమంది నేటిజన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: