ఆమె లేనిదే ప్రేమ లేదు... ఆమె లేనిదే అమ్మ తనం లేదు.. ఆమె లేనిదే అభివృద్ధి లేదు.. అసలు ఆమె లేనిదే జన్మే లేదు. సృష్టికి మూలా కారణం అయిన ఆమెకు వందనం, అభి వందనం. చరిత్రకే ఎన్నో సమాధానం లేని ప్రశ్నలను మిగిల్చిన సింధు నాగరికత లో ఆమెకు అతనికన్నా ఎక్కువ ప్రాచుర్యం ఉండేది. అన్ని సంస్థానాల్లో, ఆన్ని కార్యాలల్లో ఆమెను, ఆమె నిర్ణయాలను, ఆలోచనలకు అత్యంత గౌరవం ఉండేది.



అప్పట్లో మాతృ స్వామ్య వ్యవస్థ అమల్లో ఉండేదని మనం పుస్తకాల్లో కూడా చదివాం. కానీ రాను రాను ఆమె కల కోల్పోతూ వస్తుంది. ప్రస్తుతం సమాజం పూర్తిగా పితృ స్వామ్యం ఆధ్వర్యంలో నడుస్తున్న నేపథ్యంలో ఆమెకు ప్రాధాన్యం తగ్గింది. ఆమె పై వివక్ష పెరిగింది. ఆమె ఆలోచనలను పితృస్వామ్య వ్యవస్థ తొక్కి పెట్టింది. కానీ ఈ వివక్షను, బానిసత్వాన్ని కట్టలు తెంచుకొని నేడు ఆమె అన్ని రంగాల్లో రాణిస్తూ వస్తుంది. ఆమె అడుగిడితే రంగం ఏదైనా సారే విజయం దాసోహం అవ్వాల్సిందే అన్న విధంగా ఆమె కనబరుస్తున్న పనితీరు నిజంగా అద్భుతం..


Image result for ఉమెన్స్ డే

అత్యద్భుతం. ఆమెకు అంతంత అవకాశాలను కల్పిస్తేనే ఆమె అద్భుతాలు సృష్టిస్తుందే. అదే ఆమె ఆలోచనకు సంపూర్ణ అవకాశం లభిస్తే ఆమెను ఆపడం ఎవరి తరం...! అందుకే ఆమె ఆలోచనలకు గౌరవమివ్వండి. ఆమెకు అవకాశాలు కల్పించండి. అతనికి ఇచ్చిన మార్యాదనే ఆమెకు ఇవ్వండి చాలు. ఆమెను ఆదరిస్తే మనకు, మన దేశానికి అన్నీ విజయాలే...!!

మరింత సమాచారం తెలుసుకోండి: