ఇప్పుడు సోషల్ మీడియాలో, ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ వర్గాల్లో ఎక్కడ చూసినా రష్మిక మందన్నా – విజయ్ దేవరకొండ పేర్లే మారుమ్రోగిపోతున్నాయి. దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని, శుక్రవారం ఉదయం ఈ ఇద్దరూ తమ కుటుంబ సభ్యుల సమక్షంలో సొంత నివాసంలో ఉంగరాలు మార్చుకొని నిశ్చితార్థం చేసుకున్నారని వార్తలు సోషల్ మీడియాలో ఊపందుకున్నాయి. ఈ వార్త బయటకు వచ్చిన 24 గంటలు దాటినా, ఇప్పటివరకు అటు రష్మిక మందన్నా కానీ, ఇటు విజయ్ దేవరకొండ కానీ, ఈ విషయంపై ఎటువంటి రియాక్షన్ ఇవ్వలేదు. వీరి పీఆర్ టీమ్‌లు కూడా పూర్తి మౌనం పాటించడం వల్ల, ఈ వార్త నిజమే అని అభిమానులు ఖచ్చితంగా నమ్మకం కలిగిస్తున్నారు.


ఇప్పటివరకు ప్రేమలో ఉన్న ఈ జంట ఇప్పుడు అధికారికంగా జీవిత భాగస్వాములుగా మారిపోతున్నారని ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. “ఇకనైనా మీ ప్రేమ జీవితం సక్సెస్ కావాలి, మీరు ఎప్పటికీ హ్యాపీగా ఉండాలి” అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హార్ట్ ఫెల్ట్ పోస్టులు చేస్తున్నారు. అయితే, ఈ నిశ్చితార్థం వార్తతో పాటు మరో ఆసక్తికరమైన సమాచారం కూడా బయటకు వచ్చింది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, కొంతమంది ప్రముఖ మార్కెటింగ్ కంపెనీలు రష్మిక–విజయ్ జంట క్రేజ్ ను ఉపయోగించుకునేందుకు ముందుకు వచ్చాయట. ఇప్పటికే ఒక ప్రముఖ అడ్వర్టైజింగ్ సంస్థ వీరిద్దరితో భారీ స్థాయిలో అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ డీల్ విలువ 10 కోట్లకు పైగానే ఉందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.



దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ స్టార్ జంట గురించి చర్చలు ఊపందుకున్నాయి. టాలీవుడ్‌లోనే కాదు, మొత్తం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యంత ప్రాచుర్యం పొందిన సెలబ్రిటీ కపుల్స్‌లో వీరి పేర్లు టాప్ లిస్ట్‌లో ఉండబోతున్నాయని అభిమానులు అంటున్నారు. ఇప్పటివరకు నిశ్చితార్థం వార్తతోనే సోషల్ మీడియాలో ఇంత క్రేజ్ వస్తే, పెళ్లి తర్వాత వీరి స్టార్ ఇమేజ్ ఎంతగానో పెరగబోతోందని నెటిజన్లు ఫుల్ ఎంజాయ్ అవుతున్నారు.ఇక రాబోయే రోజుల్లో రష్మిక–విజయ్ లు కలిసి చేసే కమర్షియల్ అడ్వర్టైజ్‌మెంట్స్, ఈవెంట్స్ కూడా హాట్ టాపిక్ కానే ఉన్నాయి. వీరి కాంబినేషన్ స్క్రీన్ మీద, స్క్రీన్ బయట కూడా అదే మ్యాజిక్ కొనసాగించబోతోందని అభిమానులు విశ్వాసంతో చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: