ఆ అబ్బాయికి చదువుంది, చదువుకు తగ్గ ఉద్యోగమూ ఉంది, మంచి అందం ఉంది ఇక ఏ అమ్మాయి మాత్రం ఈ ఆబ్బాయి ప్రపోజర్ ని కాదంటుంది. ఈ ప్రేమాయణం పెళ్లి వరకు వెళితే పరవాలేదు, కానీ ప్రేమోకరితో, పెళ్లి మరొకరితో అంటేనే అసలు సమస్య. ఈ తెలివికర సాఫ్ట్ వేర్ యువకుడు ఒక మ్మాయిని ఆన్ లైన్ లో పరిచయం పెంచుకొని సాఫ్ట్ గా పడేశాడు. ఆ తరువాత ఇంకేముంది అతని మాయలో పూర్తిగా పడ్డ ఆ యువతి అ అబ్బాయికి సర్వస్వాన్ని అర్పించింది. ఆ అమ్మాయిని నిలువునా దోచుకున్న ఆ యువకుడు క్లైమాక్స్ లో ప్లేట్ ఫిరాయించాడు. చివరికి ఈ కేసు పోలీస్ స్టేషన్ కి చేరింది.



ఈ ఘటన బెంగళూరులో జరిగింది. వివరాల్లోకి వెళ్తే, శ్రీకాకుళం జిల్లాకు చెందిన వినయ్ బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజినీరుగా పని చేస్తున్నాడు. 2015లో వరంగల్ జిల్లాకు చెందిన ఓ యువతి అతనికి ఆన్ లైన్ లో పరిచయం అయింది. చాటింగ్ తో ప్రారంభమైన వారి స్నేహం ఫోన్లలో ముచ్చట్ల వరకు వెళ్లింది.ఈ నేపథ్యంలో, ఒకసారి బెంగళూరుకు రావాలంటూ యువతిని వినయ్ కోరాడు. అయితే వినయ్ మాటలను పూర్తిగా నమ్మిన ఆ యువతి బెంగుళూరు కి వచ్చింది. అప్పుడు వినయ్ ఆ యువతిని తన రూమ్ కు తీసుకెళ్లి ఆమెను లోబరుచుకొని తన కోరికను తీర్చుకున్నాడు. 


Image result for love couples shadow

ఆ తర్వాత ఆమె తన సొంత ఊరుకు వెళ్లింది. అనంతరం, పెళ్లి చేసుకుంటానని చెప్పి, మళ్లీ బెంగళూరుకు పిలిపించి, తన అక్కాబావల వద్ద ఉంచాడు. ఆమె అక్కడ ఉన్నన్ని రోజులు ఆమెతో లైంగిక వాంఛలు తీర్చుకున్నాడు. అనంతరం ఆమె మళ్లీ తన స్వగ్రామానికి వెళ్లింది. ఆ తర్వాత వినయ్ వేరే యువతోతి పెళ్లికి సిద్ధం అవుతున్నాడని తెలుసుకున్న ఆ యువతి వినయ్ కి ఫోన్ చేయగా బెంగళూరు కు రమ్మన్నాడు. ఆ యువతి హుటాహుటిన మళ్లీ బెంగళూరు కి వెళ్లగా అక్కడ వారి అక్కాబావ ఇంటికి తాళం వేసి ఉంది. చివరికి మోసపోయానని తెలిసుకుని స్థానిక పోలీస్ స్టేషన్ లో కంప్లెంట్ ఇచ్చింది.  వినయ్ కి కఠిన శిక్ష పడేంత వరకు తాను పోరాడుతానని బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ ఆమె చెప్పింది.


మరింత సమాచారం తెలుసుకోండి: