రాజకీయ నాయకులు మాటలు చెప్పమంటే బోలెడన్ని చెబుతారు. మాటలతోనే మంటలు రాజెయ్యడం మనవారి వలన అయినంత ఈజీ గా ఎవ్వరి వలనా అవ్వదు. దేశ సమగ్రత కోసం ప్రాణాలు ఇస్తాం అని కహానీలు చెప్పేవారు రాజకీయం లో స్వార్ధం కోసం కూడా ప్రాణాలు ఇచ్చేస్తారు. దేశం లో గొడవలు సృష్టించి రచ్చ చేసే రాజకీయ నాయకులకి ఈ దేశం లో కొరత లేదు. పాకిస్తాన్ ని సమర్ధిస్తూ మాట్లాడిన నేతలు ఎందఱో ఉన్నారు. కులాల మధ్యన , మతాల మధ్యన గొడవలు వచ్చేలా మాట్లాడే సారాంశం తో రాజకీయ నాయకులని చూస్తూనే ఉన్నాం. ఒక కులం పట్లా మతం పట్లా అభిమానం లేకపోయినా కేవలం వారిలో వారు కొట్టుకోవాలి అనే ఉద్దేశ్యం తో రెచ్చకొట్టే తత్వం చూస్తూ ఉంటాం. పాతబస్తీ ప్రజలని ఎంతవరకూ అభివృద్ధి పథం లో నడిపారు అనేది ఒవైసీ బ్రదర్ కే తెలియాలి కానీ మతం విషయం లో మారణ హోమం జరిగేలా మాట్లాడ్డం మాత్రం వారికి బాగా అలవాటు అయిన విషయం. పవన్ కళ్యాణ్ కూడా ఒవైసీ లాగా తయారు అవుతున్నాడు అంటున్నారు విశ్లేషకులు. బీజేపీ వ్యక్తి తరుణ్ మాట్లాడింది ముమ్మాటికీ పొరపాటే కానీ ఎవరో ఒఅరు తప్పుగా మాట్లాడారు అని చెప్పి మొత్తం ఉత్తర భారత దేశానికి ఆ తప్పుని ఆపాదించడం పవన్ కళ్యాణ్ చేసిన అతిపెద్ద తప్పు. ఎప్పుడూ పుస్తకాలు చదువుతూ లోక జ్ఞానం కంటే పుస్తక జ్ఞానం ఎక్కువ సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ ఇలాగేనా మాట్లాడేది  ? విశాల దృక్పదం తో ఆలోచించలేడా ? నిధుల దగ్గర నుంచీ అనేక విషయాల్లో సౌత్ ఇండియా కి అన్యాయం జరుగుతోంది అనే విషయం ఇవాళ కొత్తగా వచ్చి పవన్ కళ్యాణ్ ఏమీ చెప్పక్కర్లేదు. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ దానికి కారణం ఎవరు అనేది ఆలోచించాలి. మంత్రి పదవుల కోసం సొంత నియోజికవర్గాలకి అన్యాయం చేస్తున్న ఆంధ్రా , తెలంగాణా ఎమ్మెల్యే లు ఎందఱో ఉన్నారు. ఆ విషయం పక్కన పెట్టి భారత దేశం మొత్తం ఎదో దక్షిణ భారతానికి వ్యతిరేకంగా ఉంది అంటూ మాట్లాడితే ఎట్లా ? దక్షిణ భారతదేశం మొత్తం విషయం పక్కన పెట్టి…ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకూ చూసుకుంటే ఎపికి నిధులు రావడం లేదు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలేవీ నెరవేర్చడం లేదు అంటే కారణం ఎవరు? ఆంధ్రప్రదేశ్‌కి ఏం చేసినా, ఏమీ చేయకపోయినా కూడా ఇక్కడ మోడీ భజన చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి.


మరింత సమాచారం తెలుసుకోండి: