అప్పటి వరకు ఎంతో సంతోషంతో ఉన్న వారి ఒక్కసారే విషాదంలో మునిగిపోయారు.  పుట్టిన రోజు వేడుకలు ఎంతో సంతోషంగా చేసుకుందాం అనుకున్న వారికి దుఖఃం మిగిలింది.  వివరాల్లోకి వెళితే..నాగ్‌పూర్‌ సమీపంలోని వేనా డ్యామ్‌లో జరిగిన పడవ ప్రమాదంలో ఒక యువకుడు మరణించగా.. ఏడుగురు గల్లంతయ్యారు. నాగ్‌పూర్‌కు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు.. ఆదివారం వేనా డ్యామ్‌కు వెళ్లారు.

 పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా విహారయాత్రకు కలమేశ్వర్‌ ప్రాంతంలోని వేనా డ్యాంకు వెళ్లారు. ఆదివారం సాయంత్రం సమయంలో ముగ్గురు బోట్‌ సిబ్బందితో కలిసి రైడింగ్‌ చేశారు. బోట్‌లో షికారు చేస్తున్న సమయంలో వారంతా సెల్ఫీ వీడియో తీసుకున్నారు. అందులోని వ్యక్తి ఆ వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. అనుకోకుండా బోటు అదుపు తప్పడంతో అందరూ మునిగిపోయారు.
Image result for Eight youths drown in Vena Dam
ఇది, గమనించిన స్థానికులు.. ఇద్దరు బోట్‌ సిబ్బంది, ఒక విద్యార్థిని రక్షించారు.  ప్రస్తుతం గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గజ ఈతగాళ్లతో కూడిన రెండు బృందాలు ఇక్కడ గాలింపు చేపట్టాయని నాగ్‌పూర్‌ రూరల్‌ అదనపు ఎస్పీ సురేశ్‌ భోయత్‌ తెలిపారు. అయితే పడవ ఎలా మునిగిందన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదని చెప్పారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: