అసలు భారత్ లోపల ఎం జరుగుతుంది? భారత్ లోపల పుల్వామా సెక్టర్లో నిన్న జరిగిన ధారుణ హింసాకాండకు కారణాలేమిటి? భారత్ వెలుపల నుండి ఏ శత్రువు ప్రోద్భలంతో ఈ హింసా కాండ జరిగింది? భారత్ లోపల నుండి వెలుపల శత్రువుల దురాగతాలకు ప్రోత్సాహమిచ్చే శక్తులేమైనా ఉన్నాయా? ఈ అనుమానం కలగటానికి ఆస్కారం ఇచ్చింది "ముంగిట్లో ఎన్నికలు" ఉండటమే.


2014లో భారత్ లో ప్రధాని నరేంద్ర మోడీ నాయక్త్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటివరకు పరిపాలన అంతా అతుకులబొంత ప్రభుత్వాలు అంటే సంకీర్ణ ప్రభుత్వాల పాలన ఉండటం - కాంగ్రెస్ నాయకత్వం స్కాముల సుడిగుండంలో చిక్కుకొని పరిపాలన అగమ్య గోచరంగా ఉండటంతో సరిహద్దులలోని ఉగ్రవాదులకు తామాడిందే ఆట పాడిందే పాట గా మారి సరిహద్ధు రాష్ట్రం జమ్ము కాశ్మీర్ అల్లకల్లోలంగా ఉండి పాక్ కిరాతక మూకల ఘాతుకాలకు అంతు లేకుండా ఉండేది.

pulwama terror attack కోసం చిత్ర ఫలితం

ఒక్కసారిగా ఎదురులేని ఆధిఖ్యతతో మోడీ నాయకత్వంలోని బిజెపి ఒక పటిష్ట స్థిరమైన ప్రభుత్వం ఏర్పరచింది. ముఖ్యంగా పోరుగు శత్రు దేశాలైన పాకిస్థాన్ కు గుండెల్లో రాయిపడగా - చైనాకు మాత్రం పచ్చివెలగ కాయ పడింది. చైనా తానే అంటే తందానా అంటూ భయపడే ప్రభుత్వం నేడు భారత్ లో లేదు. అది డోక్లాం సంఘటనతోనే ఋజువైంది. అంతకు మించిన పెద్ద నోట్ల రద్ధుతో అంటే డిమానెటైజేషన్ తో శత్రువర్గాల ప్రొద్భలంతో పనిచేసే ఉగ్రవాద తండాల దగ్గర ఉన్న భారత్ కరన్సీ నిష్కారణంగా రద్ధైపోయింది.


డిమానెటైజేషన్ అనేది ముఖ్యంగా పాక్ కు దాని నిఘా వ్యవస్థ ఐ ఎస్ ఐ కి ఆపై దాని ఉగ్రతండా లైన జైషే మహమ్మద్ లాంటి సంస్థలకు ఊపిరి సలపకుండా పోయింది. నిజంగా చెప్పాలంటే వారికి ఊపిరి సలపటమే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏదో లాగా వారి ఉనికిని చాటుకోవలసిన అవసరం వాటికెంతైనా ఉంది.


పాక్ ఆక్రమిత కాశ్మీర్ పై గతంలో యూరి సెక్టర్ పై దాడి వెనుక పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ హస్థం ఉండటంతో దానికి ప్రతిగా భారత్ సర్జికల్ దాడి నిర్వహించి పాక్ కు మా శాంతికాముకత్ను చేతగాని తనంగా భావించినందుకు గుణపాటం చెప్పటమే గాక ప్రపంచ దేశాల్లో పాక్ పరువుప్రతిష్టలు ధారుణంగా పాతాళానికి పడిపోయాయి. ఆపై నరేంద్ర మోడీ బృందం మంత్రాంగం పనిచేసి పాకిస్తాన్ కు అమెరికా ఆర్ధిక, రక్షణ సహాకారాన్ని పూర్తిగా నిలిపివేయటం, పాక్ కరన్సీ విలువ మరీ ధారుణంగా పడిపోవటంతో ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలింది.


ఇలా బహిరంగ శత్రు దేశాలు ఉగ్రవాద శక్తులు అన్నీ కలసి ఆఖరి పోరాటానికి సిద్ధమైన తరుణంలో, చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ (సిపిఈసి) నిర్మాణానికి భారత్ అంగీకరించక పోవటం కారణం గా చైనా పాక్ ను భారత్ కు వ్యతిరేఖంగా ప్రోత్సహించటం జరుగుతూ వస్తుంది.


ఐఖ్యరాజ్య సమితి శాశ్వత సభ్య దేశాలన్నీ జైష్-ఏ-మహమ్మద్ ను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ గా గుర్తించి దాన్ని రద్ధు చేసినా దాని చీఫ్ మాసూద్ అజహర్ ను చైనా మాత్రం నిషేదించ కుండా ఉండటంలోని మర్మం భారత్ పై అతని కిరాతక చర్యలను గుర్తించకుండా పాక్ ఐఎస్ఐ ద్వారా అతన్ని ఎగదోస్తూ దేశంలో కిరాతకాలను కొనసాగించేలా పరోక్షంగా చూస్తుంది. అలాగే జైషె ఉగ్రచర్యల నేపధ్యంలో పాక్ ఉంటూ ఉగ్రవాద దమనకాండను కొంత ప్రత్యక్షంగా మరికొంత పరోక్షంగా కొనసాగిస్తున్నారు.

pulwama terror attack కోసం చిత్ర ఫలితం 

ఆరిపోయే ముందు దీపశిఖ దేదీప్యమానంగా వెలిగునట్లు ఉగ్రవాద దమనకాండ కూడా తీవ్ర రూపం దాల్చటం జరిగింది. ఇదంతా భారత్ వెలుపలనున్న మన ఇరుగు పొరుగు శత్రుదేశాలు లోపల జరిగే ఉగ్రదాడులకు ఊతం యివ్వటం ఈ పుల్వామా దాడికి ప్రధాన కారణంగా కనిపిస్తుంది.


అంతర్గతంగా భారత్ లోని ప్రతిపక్షాల పాత్ర కూడా కొంత ఉన్నట్టు అనిపిస్తుంది. ఉదాహరణకు సర్జికల్ స్ట్రైక్స్ నిజంగా జరిగినవా లేదా అని అటు కేంద్ర ప్రభుత్వాన్ని, ఇటు మన భద్రతా దళాలకు ఆ సామర్ధ్యం లేదని అనుమానించిన సందర్భాలూ ఉన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు విపరీత ప్రవర్తన మణిశంకర్ అయ్యర్ అసహ్య ప్రవర్తన విదేశీ శక్తులకు మనదేశ అంతర్గత వ్యవహారాల్లో కొంత సందిచ్చినట్లు అనిపించింది. దేశంలో దేశ రక్షణ విషయంలో రాజకీయ పక్షాల సందేహాస్పద ప్రవర్తన కూడా ఉగ్రవాద శక్తులకు కొంత ఊతమిచ్చినట్లే.


ఇక భారతీయ పౌరుల్లో అప్పుడప్పుడు బయట పడుతున్న ఇంద్రియ బలహీనతలు అంటే హానీ-ట్రాప్ (అమ్మాయిల ఏర) లోనో అక్రమ సంపద కోసమో వలలో చిక్కుకొని దేశ రహస్యాలను విదేశీ గూఢచార శక్తులకు అతిసునాయాసంగా అందించటం భద్రతా దళాలకు తీరని ప్రాణాంతక సమస్యలను తెచ్చిపెడుతు న్నాయి. ఉదాహరణకు ఆసమయంలో 2500 సీఅర్పీఎఫ్ దళాల చలనం అంటే మూవ్మెంట్ జైషే మహ్మమద్ కు ముందుగా ఎలా తెలిసింది? అప్పటి వరకు సైన్యం రవాణా సమయంలో సాధారణంగా పాటించే పౌరుల ప్రయాణాలను నిలిపివేసే సాంప్రదాయం అప్పుడు ఎందుకు నిలిపి వేయలేదు?

china pak కోసం చిత్ర ఫలితం

ఇక చెప్పుకోవలసింది నిబద్దత నిలకడ లేని జమ్ము & కాశ్మీర్ రాజకీయాలు. ఉగ్రవాదులకు బలహీన రాష్ట్రప్రభుత్వాలు స్వర్గధామాలు. అక్కడ అంతవరకు మహబూబా ముఫ్తి ముఖ్యమంత్రి పాలన ఆగిపోయి అక్కడ గవర్నర్ పాలన ప్రారంభమవటం - రాజకీయ అవకాశాల కోసం ఇంకా ఏమైనా జరిగి ఉండవచ్చు అనే అనుమానాలు పొడచూపున్నాయి. ప్రతిపక్షాలు అధికారం కోసం ఆవురావురంటున్నాయి. ఐఖ్యతలేని భారత రాజకీయాలను ఉగ్రమూకలు ఆసరా చేసుకున్నాయేమో ?  అనిపిస్తుంది.


అంత కట్టుదిట్టంగా ఉండే సైనిక పహారా ఉండే ప్రాంతంలో 350 కిలోల ప్రేలుడు పదార్ధాలున్న స్కార్పియో కారు ఎలావచ్చింది? ఇదే ప్రధాన సమస్య. ఈ కారును నడుపుతున్న అదిల్ అహ్మద్ దార్ అనే ఒక యువకుడు కాశ్మీర్ కే చెందిన వాడు. ఇంత బృహత్ దుర్మార్గానికి జైషే మహమ్మద్ కారణం అయినా సహకరించిన లోకల్ ఎవరైనా ఉన్నారా?


పఠాన్‌కోట్, ఉరి తదితర ఉగ్రదాడుల సమయంలోనూ మిగతా పార్టీలను భేటీకి పిలవని మోదీ పుల్వామా దాడి తర్వాత అఖిలపక్ష సమావేశానికి పిలుస్తున్నారు. భారత సైన్యం నియంత్రణ రేఖ దాటి సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టిన తర్వాత ఆ దాడుల గురించి వివరించేందుకు కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. అది కేవలం సమాచారం ఇచ్చుకోవడం కోసమే గానీ సంప్రదింపుల కోసం కాదు. 

mahabooba mufti & Farooq abdullah కోసం చిత్ర ఫలితం

ఆత్మాహుతి దాడి ఘటనను తీవ్రంగా పరిగణిస్తోన్న అధికార బీజేపీ అఖిలపక్ష సమావేశానికి పిలుపు నిచ్చింది. కారు బాంబుతో దాడిచేసిన ఉగ్రవాదులు భారీ సంఖ్యలో సైనికులను పొట్టన బెట్టుకోవడంతో దీనికి బదులుగా ఏం చేయాలో అజెండా నిర్ణయించడం కోసం ఈ భేటీని నిర్వహిస్తున్నారు. భారత భవిత కోసం తామంతా ఏకతాటిపై నడిచేందుకు సిద్ధంగా ఉన్నామని పార్టీలు ఈ సమావేశం ద్వారా సందేశాన్నిచ్చే అవకాశం ఉంది. దేశ రక్షణ కోసం ఐఖ్యత సాధించటానికి నరేంద్ర మోడీ కొన్ని మెట్లు దిగిరావటం ముదావహం.


పుల్వామా ఉగ్రదాడి ఘటనను ప్రపంచ దేశాధినేతలు ఖండిస్తుంటే.. పాకిస్థాన్ ప్రధాని  మాత్రం మిన్నకుండి పోయారు. చర్చల కోసం భారత్ ఒక్క అడుగు ముందుకేస్తే రెండు అడుగులు ముందుకేసేందుకు మేం సిద్ధంగా ఉన్నామని పాక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఇమ్రాన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కానీ ఉగ్రవాదులు 40మందిని పొట్టనబెట్టుకుంటే ఆయన మాత్రం నోరు మెదపలేదు.


ఇమ్రాన్ ప్రమాణ స్వీకార వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సిద్ధూ పై నెటిజన్లు మండి పడుతున్నారు. భారత సైనికులపై ఉగ్రవాద దాడిని ఖండించిన సిద్ధూ ఇలాంటి ఘటనలు జరిగినా పాకిస్థాన్‌తో చర్చలు జరపాల్సిందేనని సూచిస్తున్నాడు. కొందరు ఉగ్రవాదులు చేసిన పనికి పాకిస్థాన్ మొత్తాన్ని నిందించలేం కదా! అని తన మిత్రుడైన ఇమ్రాన్‌ కు మద్దతుగా నిలుస్తున్నాడు. భారత్, పాక్ సమస్యకు శాశ్వత పరిష్కారం వెతకాల్సిన అవసరం ఉందని ఆయన సెలవిస్తున్నాడు. ఉగ్రవాదానికి మతం, దేశం, కులం లాంటివేవీ ఉండవని సిద్ధూ చెబుతున్నాడు. పాము కాటుకు విరుగుడు విషమే అని సిద్ధూ తెలిపాడు. 

all party indian leaders కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: