నిర్భయ కేసులోని నలుగురు నిందితులకు జనవరి 7వ తారీఖున డెత్ వారంట్ లను జారీ చేసింది ఢిల్లీ సీజన్ కోర్టు. అయితే నిర్భయ కేసులో దోషులైన ముఖేశ్‌ (32), పవన్‌ గుప్తా (25), వినయ్‌ శర్మ (26), అక్షయ్‌ కుమార్‌(31)లను జనవరి 22వ తేదీ ఉదయం 7 గంటల సమయంలో తీహార్ జైలు లోని మూడవ నంబర్ గదిలో ఒకేసారి ఉరితీయనున్నారు.

 

ఇదిలా ఉండగా.. పీపుల్ అగెనెస్ట్ రేప్స్ ఇన్ ఇండియా(pari) అని పిలవబడే ఒక ఎన్జీవో నిర్భయ దోషుల ఉరిశిక్ష దృశ్యాలను టీవీలలో ప్రత్యక్షప్రసారం చేయాలంటూ కేంద్ర సమాచార, ప్రసార శాఖ ను కోరుతూ ఒక లేఖను రాసింది. 

 

ఎన్జీవో ఫౌండర్ యోగిత భయానా లేఖలో ఏం రాశారంటే.. 'జాతీయ మీడియా తో పాటు అంతర్జాతీయ మీడియా కూడా నిర్భయ దోషులకు యొక్క ఉరిశిక్ష దృశ్యాలను లైవ్ లో ప్రసారం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇతర దేశాల్లో లాగా మన దేశంలో కూడా సరైన న్యాయం, మహిళల భద్రత గురించి ఎటువంటి కఠినమైన చర్యలు తీసుకుంటన్నామనేది ప్రదర్శించడం భారత చరిత్రలో ఒక విప్లవాత్మక నిర్ణయం అవుతుంది. దీని ప్రభావం శాశ్వతంగా ఉంటుంది. ఒకవేళ భారత మీడియా ఉరిశిక్షను ప్రసారం చేస్తే సమాజానికి ఇది ఒక గట్టి మెసేజ్ అయ్యి మహిళల భద్రత బాగా పెరుగుతుంది. ఎందుకంటే.. ఎవరైనా మహిళలపై అఘాయిత్యాలు చేస్తే నిర్భయ దోషులకు పట్టిన గతే పడుతుందని జంకుతారు', అని పేర్కొన్నారు. 

 

అయితే ఈ లేఖపై కేంద్ర సమాచార, ప్రసారశాఖ త్వరలోనే స్పందించనుంది. అయితే ఈ నలుగురి దోషుల ఉరిశిక్షను లైవ్ లో ప్రసారం చేస్తే కొన్ని కోట్లమంది ఎంతోమంది ఆనందంగా వీక్షిస్తారు. మనం కూడా ఉరిశిక్ష దృశ్యాలు టీవీ ల లో ప్రత్యక్ష ప్రసారం కావాలని కోరుకుందాం.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: