
ప్రపంచం మొత్తం కరోనా గురించి భయపడుతుంటే... మాకు ఎలాంటి సంబంధం లేదు మా దారి ఎప్పుడు హింసే... హింసకు హింస చేయడమే మా పని అనే విధంగా ప్రవర్తిస్తున్నారు తాలిబన్లు. ఇటీవలే అమెరికా తాలిబన్ నాయకులతో చర్చలు జరిపారు. శాంతి ఒప్పందాలు చేసుకున్నారు. ఇక అమెరికన్ సైనికులు కూడా ఆఫ్గనిస్తాన్ నుంచి వెళ్లేందుకు సిద్ధం అయ్యారు. రెండు దశాబ్దాల సుదీర్ఘమైన రక్త చరిత్ర ముగిసింది అనుకున్నారు. ఒప్పందాలు చేసుకొని కొన్ని గంటలైనా గడవక ముందే మళ్ళీ పాత పద్దతి మొదలైంది.
తాలిబన్ ముష్కరులు ఆఫ్గనిస్తాన్ సైనికులపై దాడులు చేసి 20 మందిని పొట్టనపెట్టుకుంది. ఈ దాడి జరిగిన వెంటనే అమెరికన్ బలగాలు తాలిబన్ స్థావరాలపై దాడులు చేశాయి. ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది. తాలిబన్లతో శాంతి చేసుకోవడం అన్నది జరగని పని నిపుణులు చెప్తున్నారు. దశాబ్దాలుగా తాలిబన్లకు, ఆఫ్గనిస్తాన్ కు మధ్య అంతర్గత పోరాటం జరుగుతూనే ఉన్నది. కానీ, ఈ పోరాటం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు.
అంతర్గత పోరాటం ఫలితంగా ఆఫ్గనిస్తాన్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నో సహజవనరులు ఉన్నప్పటికీ అంతర్గత పోరాటం వలన సరిగ్గా వినియోగించుకోలేకపోతున్నారు. నిత్యం మారణహోమంతో ఆఫ్ఘన్ దద్దరిల్లిపోతున్నది. తాలిబన్లతో శాంతి చర్చలు జరిపేందుకు పాక్ చాలా కృషి చేసింది. కానీ, ఉపయోగం ఏముంది. పాక్ ఇండియా విషయంలో ఎలాగైతే నక్క బుద్దిని ప్రదర్శిస్తుందో, తాలిబన్లు కూడా పాక్ విషయంలో అనే ప్రవర్తిస్తున్నారు.
తాలిబన్, ఆఫ్గనిస్తాన్ మధ్య శాంతి, రాజీ కుదురుతుందని అనుకుంటే అది పొరపాటే. ట్రంప్ అయినా ఎలా దీన్ని నమ్మాడో అర్ధం కావడం లేదు. గతంలో కూడా ఇలానే రాజీ చర్చలు దిశగా అడుగులు వేసినా ఆ వెంటనే మరలా మారణహోమం జరిగిన సంగతి తెలిసిందే కదా. అయినా ఎందుకని ట్రంప్ దీనిని నమ్మాడు. ప్రపంచంలో అన్ని దేశాలు కరోనాతో పోరాటం చేస్తూ మందు కనుగొనే ప్రయత్నంలో ఉంటె, ఆఫ్గనిస్తాన్ లో మాత్రం దానికి పూర్తి వ్యతిరేకంగా జరుగుతున్నది.