విమాన ప్ర‌యాణికుల‌కు కేంద్ర ప్ర‌భుత్వం షాకిచ్చింది. ఏకంగా ఒకేసారి 30శాతం చార్జీల‌ను పెంచ‌డం గ‌మ‌నార్హం. ఈ కొత్త పరిమితులు వచ్చే మార్చి 31 వరకు లేదా తదుపరి ఆదేశాలు వెల్లడించే వరకు అమల్లో ఉండనున్నాయని మంత్రిత్వ శాఖ ఆదేశాల్లో పేర్కొంది. 40 నిమిషాలకు రూ.200 నుంచి రూ.1800, 60నిమిషాలకు రూ.300 నుంచి రూ.2700, 40 నిమిషాలకు రూ. 200 నుంచి రూ. 1,800 వరకు, 40 నిమిషాల నుంచి 60 నిమిషాలకు రూ. 300-రూ. 2,700, 90 నిమిషాలకు రూ. 300-రూ.2,800, 60 నుంచి 90 నిమిషాల ప్రయాణం అయితే రూ.300 నుంచి రూ. 2,700, 90 నిమిషాల నుంచి 120 నిమిషాలు ఉంటే రూ.400 నుంచి రూ.3వేలు, 120 నిమిషాల నుంచి 150 నిమిషాలుంటే రూ. 500-రూ.3,900, 150 నిమిషాల నుంచి 180 నిమిషాలుంటే రూ.600 నుంచి రూ. 4,700, 180 నిమిషాల నుంచి 210 నిమిషాల వరకు ఉంటే రూ. 700 నుంచి రూ. 5,600 వరకు చెల్లించాల్సి ఉంటుంది.


 కేంద్రం పెంచిన ఈ విమాన ధరలు మార్చి నెల వరకు లేదంటే తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కొనసాగుతాయని కేంద్రం తెలిపింది. గత ఏడాది మే 21న దే శీయ విమాన సర్వీసులను పునరుద్ధరించిన సందర్భంగా మంత్రిత్వ శాఖ విమాన టికెట్ల ధరలపై పరిమితులు విధించింది. విమాన ప్రయాణ కాలాన్ని బట్టి ఏడు శ్రేణులుగా వర్గీకరించింది. ధరల పెరుగుదల వలన విమాన ప్రయాణికులపై భారం అధికంగా ఉండనుంది. విమానయాన కంపెనీలు తమ టికెట్లలో కనీసం 40 శాతం టికెట్లు కనిష్ఠ, గరిష్ఠ పరిమితిలోని సగటు ధరకన్నా తక్కువకు విక్రయించాలని గత మే 21న డీజీసీఏ వెల్లడించింది. కొవిడ్‌ నేపథ్యంలో విమానయాన సంస్థలు తమ పూర్తి సామర్థ్యంలో 80 శాతం విమానాలు మాత్రమే నడపాలని స్పష్టం చేసింది.


కరోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా విమానాయ‌న రంగం అత‌లాకుత‌ల‌మైంది. ముక్కుమూలిగిన స‌ర్వీసులు, ప్ర‌యాణికుల సంఖ్య‌తో నిర్వ‌హ‌ణ భారాన్ని మోస్తూ అనేక సంస్థ‌లు అప్పుల పాల‌య్యాయి. ఆదుకోవాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ఎదుట ప్ర‌ణ‌మిల్లుతున్నాయి. కేంద్ర‌ప్ర‌భుత్వం తాజాగా తీసుకున్న నిర్ణ‌యం ఈ రంగానికి లాభం కన్నా న‌ష్ట‌మే ఎక్కువ‌గా చేకూరుస్తుంద‌ని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండ‌గా లాక్‌డౌన్ కార‌ణంగా అంతర్జాతీయ పౌర విమానయాన పరిశ్రమ 8.7 బిలియన్ డాలర్ల నష్టాలు చవిచూడగా, ఇందులో భారతీయ ఎయిర్‌లైన్స్ 3 బిలియన్ డాలర్ల మేర నష్టపోయాయని జెట్ ఎయిర్‌వేస్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ సుధీర్ రాఘవన్  కొద్ది రోజుల క్రితం జ‌రిగిన ఏషియన్ రూట్ డెవెలెప్‌మెంట్ ఫోరమ్ సదస్సులో పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: