మన భారతదేశం ఇప్పుడు ఇంత సస్యశ్యామలంగా ప్రశాంతంగా మనకు మనమే స్వతంత్రంగా జీవిస్తున్నామంటే దానికి కారణం పూర్వం ఎంతోమంది స్వతంత్ర ఉద్యమ కారులు పోరాట ఫలితమని చెప్పవచ్చు. ఆనాడు ఇలాంటి వారు బ్రిటిష్ దొరలకు ఎదురుచెప్పి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడి ఉండకుంటే ఈ రోజున మన పరిస్థితి వారి కాలి కింద చెప్పులాగా ఉండేది. మన దేశాన్ని 1612 వ సంవత్సరం నుండి 1947 సంవత్సరం వరకు మన దేశాన్ని ఘోరాతిఘోరంగా పరిపాలించారు. అయితే వీరు ఒక ప్రణాళిక ప్రకారమే భారతదేశంలోకి ప్రవేశించి ఆ తర్వాత మెల్ల మెల్లగా దేశం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. మోసంతోనే వీరి పాలనా ఆరంభమయింది.
335 సంవత్సరాల పాటుగా భారతీయులను పరిపాలించారు. వీరి పాలనలో భారతీయులను మనుషులుగా కూడా చూడకపోవడం అత్యంత విచారించదగ్గ విషయంగా చెప్పవచ్చు. మన దేశం ఒకప్పుడు రాజుల పాలనలో ఉండేది కాబట్టి. అనేక రాజ్యాలుగా విడిపోయి ఉండేది. వీరు సంబంధిత రాజ్య పాలకుల అనుమతిని తీసుకుని కేవలం వ్యాపారం చేసుకోవడానికని వచ్చి...కొన్ని పరిశ్రమలను నెలకొల్పి వ్యాపారాన్ని చేసుకుంటూ.. ఒక్కో రాజ్యాన్ని లోబరుచుకుంటూ వచ్చారు. ఇదే వీరు చేసిన మొట్ట మొదటి మోసం. దీనికి వీరు పెట్టిన పేరు 'విభజించు - పాలించు'. ఒక రాజ్యానికి చెందిన రాజును ఇతర రాజ్యంపైకి యుద్దానికి వెళ్లేలా ఉసిగొల్పడం వారికి సపోర్టుగా ఉండి ఆ రాజ్యాన్ని ఈ రాజ్యంలో కలుపుకోవడం. ఆ తర్వాత ఆ రాజ్యాన్ని సైతం బ్రిటిష్ వారు స్వాధీన పరుచుకోవడం.

 ఈ విధంగా దేశమంతా విభజించు పాలించు విధానంతో  అన్ని రాజ్యాలను తమ అధీనంలో పెట్టుకున్నారు. ఇందులో మన రాజుల బలహీనత కూడా ఉందని చెప్పొచ్చు. వారు చెప్పే మోసపూరిత మాటలను నమ్మడం తప్పేగా. దీని ద్వారా మనకు వారికి మధ్యన ఉన్న వ్యాపార ఒప్పందాలన్నీ కూడా రద్దు కావడం జరిగింది. మన దేశానికి సంపదగా భావించే పట్టు పరిశ్రమను బ్రిటిష్ వారు దోచుకున్నారు. ఈ వ్యాపారంలో మనము చాలా నష్టాల్లో కూరుకుపోయాము.
 

మరింత సమాచారం తెలుసుకోండి: