భారత్ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతమైన కాశ్మీర్లో ఎప్పుడు వాతావరణం ఎంత హాట్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎప్పుడూ కాశ్మీర్ లో ఏదో ఒక విధంగా ఉద్రిక్త పరిస్థితులు సృష్టించేందుకు  ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు.  దీంతో అక్కడి ప్రజలందరూ ఎప్పుడూ ప్రాణ భయంతో వణికిపోతుంటారు. ఏదో ఒక విధంగా కాశ్మీర్ ప్రాంతం లోకి ప్రవేశించి ఉగ్ర కుట్ర చేస్తూ ఉంటారు టెర్రరిస్టులు. దీంతో కాశ్మీర్ ప్రాంతంలో పరిస్థితులు ఎప్పుడూ అల్లకల్లోలం గానే ఉండేవి.



 కానీ కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం కాశ్మీర్లో పరిస్థితులను పూర్తిగా మార్చేసింది. 370 ఆర్టికల్ ను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారిపోయింది. ఇలా ఈ నిర్ణయం తర్వాత కాశ్మీర్ లో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసింది కేంద్రం. ఇక పరిస్థితులు ప్రస్తుతం కాశ్మీర్ లో సాధారణ స్థితికి వచ్చాయి. ప్రజలు అందరూ ఎంతో ప్రశాంతంగా బ్రతుకుతున్నారు. ఉగ్రవాదులు అనే మాటే కాశ్మీర్లో వినిపించడం లేదు.  ప్రభుత్వం కూడా కాశ్మీర్లో ఉన్న మారుమూల ప్రాంతాల్లో కూడా మౌలిక వసతులు కల్పిస్తుంది.




 ఇలాంటి సమయంలో మరోసారి అల్లకల్లోల పరిస్థితులు సృష్టించేందుకు ఉగ్రవాదులు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఒకప్పుడు కాశ్మీర్ లోని పలు ప్రాంతాల్లో భారీగా బాంబు పేలుళ్లకు పాల్పడి మారణహోమం సృష్టించారు ఉగ్రవాదులు. ఇక ఇప్పుడు మాత్రం కొత్త ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఒక వర్గం ప్రజలను వదిలేసి మిగతా మతస్తులను అందరినీ చంపేసి.. మీరు కూడా మాలాగె బ్రతకండి అంటూ ఒక వర్గం వారికి చెప్పి.. వారిని కూడా టెర్రరిస్ట్ లుగా మార్చడమే ప్లాన్ గా  పెట్టుకున్నట్లు తెలుస్తోంది.  అయితే దీనిని హైబ్రీడ్ టెర్రరిజం అంటున్నారు విశ్లేషకులు  ఇది వరకు దారి తీస్తుంది అన్నది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: