ఒకప్పుడు ప్రతీ చిన్న ఆయుధాన్ని కూడా విదేశాల నుంచి కొనుగోలు చేస్తూ ఉండేది భారత్. ఇలా ఆయుధాలను కొనుగోలు చేసేందుకు కోట్ల రూపాయలు ఖర్చు చేసేది. కానీ కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. విదేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేయడం తగ్గించింది. అదే సమయంలో భారత్లోనే ఆయుధాలను తయారు చేసే విధంగా భారీగా నిధులు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. దీంతో పరిశోధకులు  శరవేగంగా  ఆయుధాలను తయారు చేస్తూ వాటికి ప్రయోగాలు నిర్వహించి సక్సెస్ అవుతున్న విషయం తెలిసిందే.



 ఇలా ఇప్పటివరకు మేకిన్ ఇండియా లో భాగంగా ఎన్నో రకాల క్షిపణులను తయారు చేసింది భారత రక్షణరంగ పరిశోధనా సంస్థ. అంతే కాదు యుద్ధ విమానాలను కూడా తయారు చేస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే డి ఆర్ డి ఓ  మేకిన్ ఇండియా లో భాగంగా లైట్ వెయిట్ యుద్ధ విమానం తేజస్ యుద్ధ విమానాన్ని తయారు చేసింది. యుద్ధ విమానాలను ఇతర దేశాలకు విక్రయించేందుకు కూడా సిద్ధమైంది. ఇప్పటికే పలు దేశాలతో ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది. ఈ క్రమంలోనే లైట్ వెయిట్ యుద్ధ విమానం గా పేరున్న తేజస్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు ప్రస్తుతం మలేషియా భారత్తో చర్చలు జరుపుతోంది.



 కానీ ఇలాంటి సమయంలోనే మలేషియా దృష్టిని ఆకర్షించేందుకు సిద్ధమైంది టర్కీ. ప్రస్తుతం టర్కీ రోజురోజుకు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు యుద్ధ విమానాలను విక్రయించడమే పనిగా పెట్టుకుంది. దీనికోసం  విక్రయాలలో భారీ డిస్కౌంట్ ఇచ్చేందుకు కూడా సిద్ధమైంది. దీంతో ఇక భారత్కు చెందిన తేజస్ యుద్ధ విమానాల కంటే చౌకగా తమ యుద్ధ విమానాలను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాము అంటూ ఇటీవల మలేషియా తో టర్కీ చర్చలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే టర్కీకి చెందిన హజ్రత్ విమానాన్ని బేరానికి పెట్టింది. మరి మలేషియా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది అన్నది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: