ఆంధ్రప్రదేశ్ లో  అలాగే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పూర్తిస్థాయిలో బలపడే ప్రయత్నం చేస్తూ అధికార పార్టీ నేతలు గట్టిగా టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రులు అన్ని విధాలుగా కూడా అలెర్ట్ అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడానికి అమరావతి ఉద్యమాన్ని భారతీయ జనతా పార్టీ భుజానికెత్తుకుని ముందుకు వెళుతుంది. భారతీయ జనతా పార్టీలో కీలక నాయకులు ఈ మధ్య కాలంలో తెలంగాణలో గట్టిగా టార్గెట్ చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ ను గద్దె దించాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలను అలాగే మంత్రుల అవినీతి వ్యవహారాలను ఎక్కువగా టార్గెట్ చేస్తామని బీజేపీ చెబుతోంది. బిజెపి లో ఉన్న చాలామంది కీలక నాయకులు కూడా ఈ మధ్య కాలంలో తెలంగాణలో పర్యటనలు చేయడానికి నియోజకవర్గాల వారీగా పార్టీని బలోపేతం చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రుల నియోజకవర్గంలో జరుగుతున్న కొన్ని వ్యవహారాలకు సంబంధించి బీజేపీ కాస్త సీరియస్  గా దృష్టి సారించింది. అయితే ఇప్పుడు సీఎం కేసీఆర్ మంత్రుల విషయంలో కాస్త సీరియస్ గా ఉండి నియోజకవర్గాల్లో జరుగుతున్న కార్యక్రమానికి సంబంధించి అప్రమత్తంగా లేకపోతే మాత్రం ఇబ్బందిగా ఉంటుందని హెచ్చరించారు.

నియోజకవర్గాల్లో కొన్ని కొన్ని అంశాలకు సంబంధించి బీజేపీ నివేదికలు కూడా సిద్ధం చేస్తోందని భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు అలాగే కార్యకర్తలను కలుపుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందనే అంశాన్ని బీజేపీనీ దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ చెప్పారని అంటున్నారు. చాలా వరకు కూడా పార్టీ కార్యకర్తలు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొనే వాతావరణం తీసుకు రాకుండా ఉండాలని హెచ్చరించినట్లు సమాచారం. ఇక అవినీతి వ్యవహారాలు ఉంటే మాత్రం కచ్చితంగా తాను కూడా చర్యలు తీసుకుంటాను అని  సీఎం కేసీఆర్ మంత్రులకు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr