
అయినప్పటికీ మనిషి మాత్రం ఆ అడవులను నరుకుతూ నగరాలు నిర్మించడం లోనే బిజీ అయి పోయాడు అయితే ఇక ఇలా వాతావరణం లో సమతుల్యత లోపం కారణం గా ఉష్ణోగ్రత ఒక్క సారిగా పెరిగిపోవడం తో ఇక మంచు పర్వతాలు కరిగి పోయి సముద్ర మట్టాలు పెరిగిపోతున్నాయి. గతం లో హిమాలయాల్లో ఇలాంటి సమస్య తలెత్తింది.. ఇలా ఏకంగా మంచు పర్వతాలు కరిగి పోయి ఆ నీరు మొత్తం సముద్రాలకు చేరడం వల్ల సముద్ర మట్టం పెరిగి గ్రామాలకు గ్రామాలే సముద్రంలో కలిసిపోయే పరిస్థితి వస్తుంది.
ప్రస్తుతం అంటార్కిటికా ప్రాంతం లో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి అనేది తెలుస్తుంది. ట్యూమ్ స్టె గ్లెషియర్ ప్రాంతంలో పెద్ద యెత్తున సంక్షోభం ఏర్పడింది. రానున్న ఐదేళ్లలో ఉష్ణోగ్రత పెరుగుదల కారణం గా చాలా తీవ్రం గా దెబ్బతినే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. మంచు పలకలు కరిగిపోయి గ్రామాలకు గ్రామాలే మాయమయ్యే పరిస్థితి ఉందని పూర్తిగా గ్రామాలు కూడా మాయం అయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కాలుష్యం కారణంగా పెరిగిపోయిన ఉష్ణోగ్రత దెబ్బ అంటార్కిటికాలోని ట్యూమ్ స్టె గ్లెషియర్ ప్రాంతానికి తగులుతుంది అని అంటున్నారు శాస్త్రవేత్తలు.