తెలుగు భాషపై ఉప రాష్ట్రపతి కీలక ప్రకటన ?
గుంటూరు :  పాటిబండ్ల సీతారామయ్య పాఠశాల ఎందరో సమర్థులను దేశానికి అందించిందన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఎంతో ముందుచూపుతో అప్పట్లో సీతారామయ్య ఈ పాఠశాలను ఏర్పాటు చేశారని.. వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దని విద్య నిరుపయోగమని మహాత్మా గాంధీ అన్నారని తెలిపారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. సమాజంలో రోజురోజుకూ విలువలు తగ్గుతున్నాయి.. ప్రజల మధ్య విభేదాలు సృష్టించి విడగొడుతున్నారని... నాయకులే ప్రజల మధ్య చీలికలు తీసుకురావడం బాధాకరమని వెల్లడించారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.  చట్ట సభల్లోనే బూతులు, అసభ్య పదజాలం వాడటం దారుణమని.. కులం, మతం, నేర ప్రవృత్తి, డబ్బు ప్రదానమైపోవటం దారుణమని పేర్కొన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.  

ఇతరుల కోసం జీవిస్తే చాలా కాలం జీవిస్తావని మన భారతీయ ధర్మం చెబుతోందని.. అలా సమా జం కో సం పా డుప డి న వా రిని ప్రజలు చిరకాలం గుర్తుంచుకుంటారన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.  కానీ కొందరు విద్య , వైద్యం ను వ్యాపా రం గా చేసుకుని డబ్బు సంపాదిస్తున్నారని.. దేశానికి నాయకత్వం వహించే సమర్థులను తయారు చేయటం కూడా విద్య లక్ష్యమన్నారు ఉప రాష్ట్రపతి వెంక య్య నా యుడు.  ఉప రాష్ట్రపతి అయ్యాక కూడా నా వేషధారణ మార్చలేదన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.  మన సంప్రదాయ వస్త్రధారణ తో ఏ దే శాని కి వెళ్లి నా అందరూ గౌర విస్తున్నారని తెలిపారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.  మన సంప్రదాయాలను మనం పాటిస్తే ప్రపంచం మనం గౌర వి స్తుందన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. మన భాషను, మాతృభాషను గొరవించుకోవాలని కోరారు ఉప రాష్ట్ర పతి వెంకయ్య నాయుడు.ఆం ధ్ర ప్రదేశ్‌  రాష్ట్ర పౌరులు, ప్రజలు ఎల్లప్పుడు సంతోషంగా ఉండాలని తెలిపారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ప్రజల కోసమే ప్రభుత్వాలు పని చేయాలని చెప్పారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap