ప్రతి ఏడాదీ వర్షాకాలం మొదలవడానికి ముందు డెంగ్యూ వ్యాధి అందర్నీ కలవరపెడుతుంది. ఇప్పటికె తెలంగాణలో కేసులు భారీగా పెరిగాయి. దీనికోసం ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ పెట్టబోతోంది. ఇక ఆ కష్టాలకు కూడా చెల్లుచీటీ పాడే అవకాశముందని తేలిపోయింది. ఎందుకంటే త్వరలోనే డెంగ్యూకి విరుగుడుగా టీకా రాబోతోంది. ఇప్పటి వరకూ డెంగ్యూ వస్తే కేవలం చికిత్సతోనే సరిపెడుతున్నారు. దోమలు కుట్టకుండా చూసుకోండి అని నివారణోపాయం చెబుతున్నారు. కానీ ఇకపై డెంగ్యూకి టీకాని అందుబాటులోకి తెస్తున్నారు. జపాన్‌కు చెందిన ‘టకేడా’ అనే ఫార్మాసంస్థ ఈ టీకాను తయారు చేసింది. ఈ టీకాను ప్రస్తుతం ‘టీఏకే-003’ అనే పేరుతో పిలుస్తున్నారు. ప్రస్తుతం డెంగ్యూ నివారణకు వాడే ఈ టీకా క్లినికల్‌ ట్రయల్‌ దశలో ఉంది. దీన్ని త్వరలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తారు.

డెంగ్యూ ముఖ్యంగా భారత్ కు పెద్ద ప్రమాదకారిగా మారింది. భారత్ లో ప్రతి ఏటా వర్షాకాలం మొదలయ్యే ముందు దేశవ్యాప్తంగా సగటున 3.3 కోట్ల మంది మంది డెంగ్యూ వ్యాధికి గురవుతున్నారని అంచనా. డెంగ్యూతో కోలుకోవడం చాలా కష్టం. ప్లేట్ లెట్స్ పడిపోవడం, మనిషి మనరణపు అంచులకు వెళ్లడం ఖాయం అని అంటున్నారు. మరణాల సంఖ్య కూడా అధికంగానే ఉంటుందని గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ టీకా పనితీరుని పరిశీలించేందుకు క్లినికల్‌ ట్రయల్స్‌ ని భారత్ లో కూడా చేపట్టారు. మన దేశంలో 480మందిపై టీఏకే-003 టీకాని ఇచ్చి దాని పనితీరు పరిశీలిస్తున్నారు. 70మంది కోల్‌ కతా వాసులపై కూడా క్లినికల్ ట్రయల్స్ జరిగాయి. ఎందుకంటే భారత్ లో డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదయ్యేది కోల్‌ కతా నగరంలోనే.

కోల్ కతాలోని నాలుగు ఆస్పత్రుల్లో ఈ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభించారు. ఈమేరకు ప్రముఖ ఫార్మకాలజీ శాస్త్రవేత్త డాక్టర్‌ రఘు రామ్‌ రావు వివరాలు తెలియజేశారు. కోల్‌ కతాలోని బీసీ చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌ సహా మరో మూడు ఆస్పత్రుల్లో ఈ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. అయితే వీటితో సైడ్ ఎఫెక్ట్స్ ఏవీ లేవని తేలింది. ఈ క్లినికల్‌ ట్రయల్స్‌ లో నాలుగేళ్ల చిన్నారి నుంచి 60 ఏళ్ల వృద్ధు వరకు టీకాలు ఇస్తున్నారు. డెంగ్యూ వ్యాధికి గురైనవారిపై ప్రయోగాలు జరుగుతున్నాయి. అలాంటి వారు ప్రమాదకర పరిస్థితుల్ోలకి వెళ్లకుండా 84శాతం మంది కోలుకున్నారు. సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవని తేలింది. దీంతో ఈ టీకాపై ఆశాజనకమైన రిపోర్ట్ లు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: