రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలు జోరుమీదున్నాయి. ఇరు రాష్ట్రాల అధికార ప్రతిపక్ష పార్టీలు రాబోయే ఎన్నికల కోసం ఇప్పటి నుండే అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇక మధ్య మధ్యలో విపక్షాలు అధికార పార్టీలను ఇరకాటంలో పెట్టడానికి సకల ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే కొన్ని విషయాలలో సక్సెస్ అవుతున్నా , మరికొన్ని విషయాలలో చతికిలపడుతుంటాయి. ఇదిలా ఉంటే ఈ రెండు రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రానికి విచ్చేసిన హోమ్ మినిస్టర్ అమిత్ షా హైదరాబాద్ లో ప్రత్యేకంగా టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ని కలవడం సంచలనంగా మారింది.

అయితే వీరిద్దరూ ఏ విషయం మీద చర్చించుకున్నారు అనేది వారిద్దరికి తప్పించి మరెవ్వరికీ తెలియదు. కానీ ఆ సమావేశం గురించి రెండు తెలుగు రాష్ట్రాలు ఎవరికి తోచినట్లు వారు ఊహించుకుని ఏదేదో మాట్లాడారు. అయితే దివంగత నేత స్వర్గీయ నందమూరి తారకరామారావు సతీమణి లక్ష్మి పార్వతి మాత్రం ఈ సమావేశంలో ఏమి జరిగిందో తెలియకపోయినా కొందరేమో సినిమా గురించి అని, మరికొందరేమో బీజేపీ రాజకీయ స్వార్ధం కోసం అని అంటున్నారు. అంతే కాకుండా ఈమె ఈ రోజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ తన తాత స్థాపించిన టీడీపీ ని హ్యాండ్ ఓవర్ చేసుకుని... నాయకులకు లీడర్ గా ఉండి దిశానిర్దేశం చేయాలని ఆమె ఆకాక్షించారు.


కాగా టీడీపీ ని ప్రస్తుతం చంద్రబాబు నాయుడు లాగలేక లాగుతున్నాడు. పైగా చంద్రబాబు తర్వాత టీడీపీకి వారసుడిగా నారా లోకేష్ ను కార్యకర్తలకు పరిచయం చేస్తుండడంపైన ఈమె అసంతృప్తిగా ఉన్నారు. అందుకే టీడీపీ నాయకులు అంతా కూడా మార్పు కావాలని భావిస్తున్నారు. ఆ మార్పు కూడా జూనియర్ ఎన్టీఆర్ తో మొదలు కావాలని ఈమె కోరిక. మరి లక్ష్మి పార్వతి కోరిక తీరుతుందా లేదా అన్నది తెలియాలంటే ఎన్టీఆర్ స్పందించాల్సి ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: