డబ్బులను పొదుపు చెయ్యాలని ఆలోచించే వారికి ఎన్నో పథకాలు అందుబాటులో ఉన్నాయి.. అందులో ప్రభుత్వ స్కీమ్ లలో ఇన్వెస్ట్ చెస్తె మంచి లాభాలను పొందవచ్చు.. అలాగే మన డబ్బులు సేఫ్ కూడా.రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని వారికి, ప్రతి నెలా రెగ్యులర్ పెన్షన్ పొందాలని భావించే వారికి రెండు స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. పీఎంవీవీవై, ఎస్‌సీఎస్ఎస్ అనేవి ఇవి. వీటిల్లో చేరడం వల్ల కచ్చితమైన రాబడి వస్తుంది..ప్రధాన్ మంత్రి వయ వందన యోజన (పీఎంవీవీవై) స్కీమ్ విషయానికి వస్తే.. ఎల్ఐసీ ఈ పథకాన్ని అందిస్తోంది.


ఇది కేంద్ర ప్రభుత్వపు సబ్సిడీ పెన్షన్ ప్లాన్. 60 ఏళ్లు లేదా ఆపైన వయసు కలిగిన వారు ఇందులో చేరొచ్చు.. సీనియర్ సిటిజన్స్‌ ఈ స్కీమ్‌లో రూ. 15 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది చొప్పున పెన్షన్ పొందొచ్చు. మీకు నచ్చిన ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం పదేళ్లు. అంటే 10 ఏళ్ల వరకు పెన్షన్ పొందొచ్చు..వడ్డీ మొత్తాన్ని పెన్షన్ రూపంలో పొందొచ్చు. ఇన్వెస్ట్ చేసిన మొత్తాన్ని పదేళ్ల తర్వాత తిరిగి చెల్లిస్తారు. ప్రస్తుతం ఈ స్కీమ్‌పై 7.4 శాతం వడ్డీ లభిస్తోంది. రూ. 15 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే.. నెలకు రూ. 9250 వరకు వస్తాయి.

ఈ విధంగా పదేళ్ల వరకు పొందొచ్చు. ఈ స్కీమ్ 223 మార్చి 31 వరకే అందుబాటులో ఉంటుంది. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ విషయానికి వస్తే.. ఇందులో కూడా నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది చొప్పున పెన్షన్ పొందొచ్చు. కేంద్రం ఈ స్కీమ్‌ను అందిస్తోంది. పోస్టాఫీస్ లేదా బ్యాంకుల్లో ఈ పథకం అందుబాటులో ఉంది.ఈ స్కీమ్‌లో కూడా ఇన్వెస్ట్ చేసిన మొత్తాన్ని మెచ్యూరిటీ తర్వాత తిరిగి చెల్లిస్తారు. ఇక పెట్టిన డబ్బులపై వచ్చే వడ్డీ మొత్తాన్ని నెల వారీగా పొందొచ్చు. ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం ఐదేళ్లు. అవసరం అయితే స్కీమ్ మెచ్యూరిటీ కాలాన్ని మూడేళ్లు పొడిగించుకోవచ్చు. ప్రస్తుతం ఈ స్కీమ్‌పై 7.6 శాతం వడ్డీ వస్తోంది.

వయ వందన యోజన పథకం కన్నా ఈ స్కీమ్‌లోనే ఎక్కువ వడ్డీ రేటు లభిస్తోందని చెప్పుకోవచ్చు. మెచ్యూరిటీ కాలం కూడా తక్కువగానే ఉంది. ఇలా సీనియర్ సిటిజన్స్‌కు రెగ్యులర్ ఇన్‌కమ్ అందించేందుకు రెండు స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయని చెప్పుకోవచ్చు. రిస్క్ లేకుండా రాబడి పొందాలని భావించే వారు ఈ పథకాల్లో డబ్బులను దాచుకోవచ్చు..మంచి రాబడితో పాటు సేఫ్ కూడా..

మరింత సమాచారం తెలుసుకోండి: