370 ఆర్టికల్ రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ ప్రాంతం లో కొన్నాళ్ల పాటు ఉదృత పరిస్థితులు ఉన్నప్పటికీ ఆ తర్వాత మాత్రం పరిస్థితులు సద్దుమనిగాయి అన్న విషయం తెలిసిందే. ఇక పాకిస్తాన్ నుంచి భారత్లోకి అక్రమం గా చొరబడే ఉగ్రవాదుల ఆటలకు ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేస్తూ భారత ఆర్మీ ఎన్కౌంటర్లు చేస్తూ వచ్చింది.. అంతేకాదు ఇక ఉగ్ర స్థావరాలను గుర్తించి వారిని మట్టు పెట్టడమే లక్ష్యం గా ఎన్నో ఆపరేషన్స్ కూడా నిర్వహించింది అన్న విషయం తెలిసిందే. అయితే మొన్నటి వరకు జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఉగ్ర కార్యకలాపాలు కాస్త తగ్గాయ్.


 కొన్ని రోజుల నుంచి మళ్లీ ఉగ్ర వాదులు జమ్మూ కాశ్మీర్ ప్రాంతం లో రెచ్చి పోతున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఏకంగా స్థావరాలను ఏర్పాటు చేసి ఉగ్ర కుట్రలకు ప్లాన్ చేయడమే కాదు ఏకంగా సామాన్య పౌరులపై కూడా కాల్పులకు తెగ పడుతూ ఉండడం చూస్తూ ఉన్నాం. ఇలా నెలల వ్యవధి లో ఉగ్రవాదుల కాల్పుల్లో దాదాపు పదిమందికి వరకు కూడా సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు.  ఈ క్రమం లోనే ఇక ఆయా ప్రాంతాల లో తీవ్రమైన భయాందోళనలు నిండి పోయాయి అని చెప్పాలి. ఇకపోతే ఇటీవలే దీనిపై  కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది అని చెప్పాలి.


 జమ్ము కాశ్మీర్ ప్రాంతం లో ఉగ్రవాదుల కార్యకలాపాలు పెరుగుతూ ఇక ఉధృత పరిస్థితులు చోటుచేసుకుంటున్న నేపథ్యం లో అదనం గా 2000 మంది సిఆర్పిఎఫ్ భద్రత సిబ్బందిని జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో మొహరిస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. గత రెండు రోజులుగా రాజోలి, ఫౌంచ్ జిల్లా లో ఉగ్రవాదులు జరుపుతున్న దాడుల్లో ఇద్దరు చిన్నారులతో సహా ఆరుగురు చనిపోగా.. 11 మంది గాయపడ్డారు. దీంతో అదనపు బలగాలను మొహరించి భద్రతను కట్టుదిట్టం చేసినట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: