ఆంధ్రప్రదేశ్ లో 2019 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో జగన్ మార్క్ పాదయాత్ర వలన వైసీపీ విజయ దుందుభి మోగించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గాలిలో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు సారధ్యం వహించిన టీడీపీ కేవలం 23 చోట్ల మాత్రమే గెలుపు సాధించింది. ఈ ఎన్నికల ఫలితంతో తెలుగు రాష్ట్రాలలో ఉన్న సీనియర్ రాజకీయ నాయకులు అంతా కూడా అవాక్ అయ్యారు. ఈ ఎన్నికలలో కొన్ని నియోజకవర్గాలలో టైట్ ఫైట్ ఉందని ముందే ఊహించిన నియోజకవర్గాల్లో నెల్లూరు జిల్లాకు చెందిన నెల్లూరు సిటీ ఒకటి. ఇక్కడ వైసీపీ తరపున అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయగా , టీడీపీ తరపున మాజీ మంత్రి పొంగూరు నారాయణ పోటీ చేశారు.

కానీ ఎన్నికల ముందు వరకు గెలిచేది నారాయణే అని సర్వేలు కూడా తేల్చి చెప్పాయి. కానీ అనూహ్యంగా అనిల్ కుమార్ యాదవ్ గెలుపు బరిలో నిలిచాడు. అలా చివరికి వీరిద్దరి మధ్యన దోబూచులాడిన విజయం కాస్తా అనిల్ కుమార్ యాదవ్ సొంతం అయింది. ఆర్ధికంగా బలమైన నారాయణను ఓడించడంతో రాష్ట్రము అంతా అనిల్ పేరు మార్మోగిపోయింది. ఆ వెంటనే జగన్ క్యాబినెట్ లో జలవనరుల శాఖ మంత్రిగా ఛాన్స్ కొట్టేశాడు. మంత్రి అయితే అయ్యాడు కానీ పదవికి ఏమాత్రం న్యాయం చేయలేకపోయాడు. ఒకానొక దశలో ప్రతిపక్ష నాయకులు అనిల్ ను మాటల మంత్రి చేతల మంత్రి కాదు అని విమర్శించారు.

అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లకే మళ్ళీ రెండవ సారి క్యాబినెట్ మార్పులు జరిగాయి. అయితే ఈసారి అనిల్ కుమార్ యాదవ్ పదవిని కోల్పోయాడు. ఇక సొంత నియోజకవర్గంలోనూ ప్రజల చేత విమర్శలు గుప్పించుకునే స్థాయికి పడిపోయాడు. ఇక తన బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ తో వివాదాలు కావడంతో రెండు వర్గాలుగా విడిపోయి బలహీనం అయ్యాడు. మరి ఇటువంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో గెలవడం సాధ్యమా అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  





మరింత సమాచారం తెలుసుకోండి: