తాజాగా వెల్లడైన మూడు పట్టభద్రుల ఎంఎల్సీ నియోజకవర్గాల ఫలితాలతో తెలుగుదేశంపార్టీ, ఎల్లోమీడియా రెచ్చిపోతోంది. ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ రాయలసీమల పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికలో టీడీపీ అభ్యర్ధులు గెలిచారు. దాంతో టీడీపీ, ఎల్లోమీడియాను పట్టడం కష్టంగా ఉంది.  తొమ్మిది స్ధానికసంస్ధలు, రెండు టీచర్ల నియోజకవర్గాలకు కూడా ఎన్నికలు జరిగాయి. మరి వీటన్నింటినీ వైసీపీనే గెలుచుకున్నది. అంటే 14 స్ధానాలకు ఎన్నికలు జరిగితే 11 స్ధానాలను వైసీపీ, మూడుస్ధానాలను టీడీపీ గెలుచుకున్నది.





మూడు స్ధానాల్లో గెలుచుకోవటం ఆలస్యం ఈ ఫలితాలు ప్రజల రెఫరెండమనే విచిత్రమైన వాదనను చంద్రబాబునాయుడు, అచ్చెన్నాయుడు, ఎల్లోమీడియా తెరపైకి తెచ్చాయి. తొమ్మిది జిల్లాల్లో 108 నియోజకవర్గాల్లోని పట్టభద్రులందరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లువేశారు కాబట్టి ఇది కచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పాలనపై ప్రజల  రెఫరెండమే అని నానా గోలచేస్తున్నారు. మరి రెండు టీచర్ల నియోజకవర్గాల్లో వైసీపీ గెలిచింది కదాంటే దాన్ని పట్టించుకోవటంలేదు.





ఇక్కడే వైసీపీ నుండి ఎదారుదాడి మొదలైంది. నిజంగానే ఇది రెఫరెండమని టీడీపీ అనుకుంటుంటే చంద్రబాబు, అచ్చెన్న, బాలకృష్ణతో పాటు విశాఖలో తమ్ముళ్ళు రాజీనామాలు చేయగలరా ? అని చాలెంజ్ విసురుతున్నారు. టీడీపీకి  రాయలసీమలో ముగ్గురు ఎంఎల్ఏలు, ఉత్తరాంధ్రలో ఆరుగురు ఎంఎల్ఏలున్న విషయం తెలిసిందే.  తొమ్మిదిమంది ఎంఎల్ఏలు రాజీనామా చేసి ఉపఎన్నికల్లో మళ్ళీ గెలిచేంత ధైర్యముందా అని వైసీపీ నేతలు సవాలు విసరుతున్నారు. తమ గెలుపుమీద వీళ్ళకి అంత నమ్మకమే ఉంటే వెంటనే ఎందుకు రాజీనామా చేయకూడదని నిలదీస్తున్నారు.





చంద్రబాబు అండ్ కో రాజీనామాలు చేసి ఉపఎన్నికల్లో గెలిస్తే అప్పుడు రెఫరెండం అని అంగీకరించే అవకాశముందని అధికారపార్టీ అంటోంది. ఎందుకంటే పట్టభద్రుల నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికలు సాధారణ ప్రజల ఓటింగుతో సంబందంలేదని చెబుతున్నారు. సమాజంలోని అన్నీవర్గాల ప్రజలు ఓట్లేసినపుడు వచ్చే ఫలితమే అసలైన ప్రజాతీర్పు అనిపించుకుంటుంది కాబట్టి రాజీనామాలు చేసి తర్వాత మాట్లాడాలని చాలెంజ్ విసురుతున్నారు.  మరి వైసీపీ సవాలుకు చంద్రబాబు అండ్ కో సిద్ధమేనా ? రాజీనామాలు చేస్తారా ? అన్నది చూడాలి.




మరింత సమాచారం తెలుసుకోండి: