రాబోయే ఎన్నికల్లో నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో వైసీపీ తరపున ఎవరు పోటీచేస్తారనే విషయంలో ఉత్కంఠ పెరిగిపోతోంది. ఇప్పటికే మూడుపేర్లు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలోనే మరో మహిళ పేరు కూడా ప్రచారం ఊపందుకుంది. ఇప్పటివరకు ధనుంజయరెడ్డి, ఒంటేరు వేణుగోపాలరెడ్డితో పాటు తాజాగా పార్టీలో చేరిన బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే వీటికి తోడు తాజాగా రచనారెడ్డి అనే అమ్మాయి పేరు కూడా ప్రచారం మొదలైంది.





ఇంతకీ రచనారెడ్డి ఎవరంటే వైసీపీ సస్పెండ్ చేసిన ఎంఎల్ఏ మేకపాటి చంద్రశేఖరరెడ్డి కూతురే. ఎంఎల్ఏ రెండు వివాహాలు చేసుకున్నారట. రచనారెడ్డి మొదటి భార్య కూతురు. పైన చెప్పిన నేతలకు రచనకు తేడా ఏమిటి ? ఏమిటంటే రచనకు మేకపాటి రాజమోహన్ రెడ్డి మద్దతుండటమే. తమ్ముడు మేకపాటి చంద్రశేఖరరెడ్డికి పోటీగా అన్న రాజమోహన్ రెడ్డి దగ్గరుండి రచనను పోటీకి ప్రోత్సహిస్తున్నారు. చంద్రశేఖరరెడ్డి రాబోయే ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీచేయటం ఖాయమనే అంటున్నారు.





కాబట్టి తమ్ముడిపైన ఆయన కూతురు రచననే అన్న రాజమోహన్ రెడ్డి పోటీచేయించేందుకు చాలా ఆసక్తిగా ఉన్నారు. రచనకు వైసీపీ టికెట్ ఇస్తే దగ్గరుండి తాము గెలిపించుకుంటామని రాజమోహన్ రెడ్డి ఇఫ్పటికే బహిరంగంగానే ప్రకటించారు. రాజమోహన్ రెడ్డి ఇంత బహిరంగంగా ప్రకటించారంటే రచనకు టికెట్ ఖాయమనే అని అనుకుంటున్నారు. ఎందుకంటే పైన చెప్పిన నేతలకన్నా రాజమోహన్ కు జగన్మోహన్ రెడ్డితో అత్యంత సన్నిహిత సంబంధాలున్న విషయం అందరికీ తెలిసిందే.





పైగా రాజమోహన్ రెడ్డి దగ్గరుండి తాము గెలిపించుకుంటామంటే జగన్ కు ఇంతకన్నా కావాలసిందేముంది ? ఆర్ధిక, అంగబలాల్లో అత్యంత పటిష్టంగా  ఉన్న రాజమోహన్ రెడ్డి చెప్పినట్లుగా రచనకు టికెట్ ఇస్తే మొత్తం భారమంతా వాళ్ళే చూసుకుంటారు. అలాకాదని బయటవాళ్ళకి జగన్ టికెట్ ఇస్తే డబ్బులతో పాటు ప్రచారభారాన్ని కూడా ఎంతోకొంత పార్టీ భరించాల్సుంటుంది. రాజమోహన్ రెడ్డి కుటుంబం బయట వాళ్ళకి కూడా మద్దతుగా పనిచేస్తారు కానీ బయటవాళ్ళకు పనిచేయటానికి తమింటి అమ్మాయికి పనిచేయటానికి తేడా ఉంటుంది కదా.

మరింత సమాచారం తెలుసుకోండి: