తమిళనాడు చిన్నమ్మ శశికళ జైలు నుండి విడుదల కావలసి ఉండగా ఇప్పుడు ఆదాయపు పన్ను శాఖ మరో షాక్ ఇచ్చింది. ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇప్పుడు తమిళనాడు చిన్నమ్మకు బినామీ నిషేధిత చట్టం కింద ఆమెకు సంబంధించిన రూ.2వేల కోట్ల విలువైన ఆస్తులను ఈకేసు కింద సీజ్ చేస్తున్నట్టు తెలిపింది. దీని వివరాలు చూస్తే కొడనాడ్ సిరతపూర్ లో శశికళ ఇళవరసి సుధాకరణ్ పేరిట ఉన్న ఆస్తులుగా తెలియచేసింది.