ప్రశాంత్ కిషోర్ కు దేశంలోనే అత్యంత ప్రతిభావంతమయిన రాజకీయ వ్యూహకర్తగా పేరుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ తో ప్రశాంత్ కిషోర్ సమావేశమైనట్లు తెలుస్తోంది. ఇంతకుముందు చెబుతున్న విధంగా కేసీఆర్ బీజేపీ కాంగ్రెస్ లకు వ్యతిరేకంగా జాతీయ రాజకీయాల్లో తాను కీలక పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నానంటూ చెప్పుకొస్తున్నారు. గతంలోనే ఆయన మమతా బెనర్జీ, స్టాలిన్, కుమార స్వామి వంటి నేతలనూ కలిశారు. అయితే ఇతర రాజకీయ కారణాలతో తన ప్రయత్నాలను మానుకున్నారు.