తెలంగాణ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తగా నగరంలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. కాగా రవాణా సదుపాయానికి కూడా తీవ్ర అంతరాయం కలిగింది. ముఖ్యంగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీ ఎత్తున వర్షపు నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. అనేక వాహనాలు ఎక్కడవి అక్కడే ఆగిపోయి, కిలోమీటర్ల మేర బారులు తీరాయి.