దావూద్ ఇబ్రహీంకు చెందిన ఆస్తులను వేలం వేయడానికి స్మగ్లర్స్ అండ్ ఫారిన్ ఎక్సేంజ్ మానిప్యులేటర్స్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు....అయితే ఈ వేలాన్ని నవంబర్ 10 న మహరాష్ట్రలోని రత్నగిరి జిల్లా ఖేడ్ తాలుకాలోని ముంబ్కే గ్రామంలో అమలు చేయనున్నట్లు అధికారులు తెలియచేసారు. అయితే ఇప్పుడు కరోనా మహమ్మారి కారణంగా ఈ వేలం ప్రక్రియను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే దీనికి సంబంధించిన ఆస్తుల వాల్యుయేషన్ ప్రక్రియ గతేడాదే పూర్తయిన విషయం తెలిసిందే.