అమరావతి రాజధాని విషయం పై 5 ఏళ్లు గడుస్తున్నా విషయం ముందుకు సాగనంటోంది... ఇప్పుడున్న ప్రభుత్వానికి అయితే అసలు అమరావతిపై ఆసక్తి లేదని ఎలాగో తేలిపోయింది... అందుకే వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల నిర్ణయాన్ని తీసుకుంది ఏపీ ప్రభుత్వం. కేంద్రం కూడా రాష్ట్ర రాజధాని విషయం పూర్తిగా రాష్ట్రానికే పరిమిత మంటూ సైలెంట్ గా ఉండి పోవడంతో అమరావతి ఏకైక రాజధానిగా ఉండే విషయం కాస్తా అటకెక్కింది.