ఏదేమైనా కేసీఆర్ కి ఉన్న డేరింగ్ అండ్ డాషింగ్ నేచర్ తెలుగు రాష్ట్రాల్లో ఏ నాయకుడికి లేవని చెప్పాలి.. ఉమ్మడి రాష్ట్రంలో చక్రం తిప్పిన నేతలు ఉండగా ఓ మాములు ఎమ్మెల్యే అయినా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ గాంధీ గా అవతరించారు..ఆ తరువాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని ఒక విధంగా దేశ నేతల కళ్ళల్లో కూడా పడ్డాడు. అయితే తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు కేసీఆర్ ఏది చెపితే అది జరిగేది.. దానికి ప్రతిపక్షాలు కూడా పెద్దగా వ్యతిరేకించేవి కాదు. కానీ రెండో సారి అధికారంలోకి వచ్చినప్పుడు కేసీఆర్ కి ప్రజలనుంచి కూడా కొంత వ్యతిరేకత మొదలైంది..