వైసీపీ పార్టీ లో మంత్రి గా ఉండి సొంత నియోజక వర్గంలో తన మాట చెల్లుబాటు కావట్లేదని అవంతి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. విశాఖ జిల్లా రాజకీయాల్లో అవంతి శ్రీనివాస్ ఎన్నో ఏళ్లుగా చక్రం తిప్పుతున్న సంగతి తెలిసిందే. వైసీపీ తరపున గెలిచి ఇప్పుడు విశాఖ లో కీలక నేతగా ఎదిగాడు.. అక్కడ టీడీపీ తరపున చక్రం తిప్పిన గంటా లాంటి వాళ్ళని నిలువరించి ఘనత అవంతి శ్రీనివాస్ కి ఉంది.. అలాంటి అవంతి శ్రీనివాస్ ఈ మధ్య తన నియోజక వర్గంలో పట్టు కోల్పోతున్నాని వాపోతున్నారు. అందుకు కారణం విజయ సాయి రెడ్డి అని పరోక్షంగా అయన వ్యాఖ్యలు చేస్తున్నారు..