రాష్ట్రంలో నిమ్మగడ్డ రమేష్ స్థానిక ఎన్నికల నిర్వహణకు ఎంతో హడావుడి చేస్తున్న సంగతి తెలిసిందే.. ఓ వైపు కరోనా ఇంతలా విజృంభిస్తున్న ఆయనకు ఎందుకు స్పృహ ఉండట్లేదు అని అధికార పార్టీ వైసీపీ అంటుంటే విపక్షాలు మాత్రం నిమ్మగడ్డ కు సపోర్ట్ చేస్తున్నాయి. టీడీపీ నిమ్మగడ్డ తన అంటే తందానా అంటూ వైసీపీ ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతుంది.. ఒకప్పుడు కరోనా ఉందని వాయిదా వేసిన నిమ్మగడ్డ అదే కరోనా వేల సంఖ్యలో ఉన్నప్పుడు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పడం పెద్ద వివాదమవుతుంది. మరికొన్ని రోజుల్లో అయన పదవీ కాలం ముగియనుండటంతో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఎన్నికలు నిర్వహించి అధికార పార్టీ గెలవనీయకుండా చేయాలన్నది అయన ఆలోచన..