వైఫల్యాలు చూస్తుంటే కేసీఆర్ కి రాబోయే రోజులు ఇంకెలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.. క్రమక్రమంగా పార్టీ బలం తగ్గుతుందని స్పష్టంగా తెలుస్తుంది.. ఇక త్వరలో తెలంగాణ లో మరికొన్ని ఎన్నికలు జరగనున్నాయి.. నాగార్జున సాగర్ లో త్వరలో ఉప ఎన్నిక జరగనుంది.. అధికార పార్టీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అర్థాంతరంగా మరణించగా ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది..ఇంకా పట్టభద్రుల ఎమ్మెల్సీ త్వరలో జరగనుంది. దీంతో ఎన్నికల హడావుడి మరోసారి మొదలవుతుందని చెప్పొచ్చు.