ఇతర రాష్ట్రాల సంగతి ఎలా ఉన్నా ఏపీ లో అధికార, విపక్షాలు ఎల్లప్పుడూ విమర్శించుకుంటూనే ఉంటాయి.. పోటీ పోటీగా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. ముఖ్యంగా చంద్రబాబు, జగన్ ల కాంబో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ప్రతిపక్షాలు కొన్ని కొన్ని సార్లు ఇబ్బంది పెట్టాలని చూసినా దాన్ని జగన్ అధిగమించి సుపరిపాలన కొనసాగిస్తున్నారు.. సరిగ్గా రెండేళ్ల క్రితం జగన్ పరిస్థితి ఎలా అయిపోతుందో అన్నవారి ముక్కున వేలేసుకునేలా జగన్ ఎదిగారు..ఎన్ని కష్టాలు వచ్చిన ప్రజలకిచ్చిన మాట తప్పలేదు.. గెలవకముందు ఏదైతే హామీలు ఇచ్చారో అవి చేస్తూ బెస్ట్ సీఎం అనిపించుకుంటున్నారు..