రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదని మరీ నిమ్మగడ్డ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి పూనుకున్నాడు. మొదటినుంచి ప్రభుత్వం ఎడ్డం అంటే తను తెడ్డం అంటున్నాడు.. ఇక ఇటీవలే స్థానిక ఎన్నికల షెడ్యూల్ కూడా రిలీజ్ చేసి ఒక్కసారిగా అందరిలో ప్రకంపనలు సృష్టించాడు. మొదటినుంచి ప్రభుత్వానికి వ్యతిరేక పనులే చేస్తున్న నిమ్మగడ్డ చేసిన ఈ పనిలో పెద్దగా ఆశ్చర్యం లేకపోయినా ఏకంగా తేదీలను ప్రకట్టించడం చూస్తుంటే నిమ్మగడ్డ వెనుక ఎదో పెద్ద హస్తం ఉందని మాత్రం అర్థమవుతుంది.. ఈ నెల 23, 27, 31, ఫిబ్రవరి 4వ తేదీన వరుసగా ఒక్కో దశకు సంబంధించి నోటిఫికేషన్లు విడుదల చేస్తారు.