ప్రజలకు సేవ, సంక్షేమ పథకాలు అందించే విషయంలో కేసీఆర్ వైఖరి పూర్తిగా మారిందని చెప్పొచ్చు. ఇటీవలే ఆయనకు ప్రజలు చెప్పిన గుణపాఠం కారణంగానే ఈ మార్పుకు కారణమని ప్రతిపక్షాలు అంటున్నాయి.. తెలంగాణ లోని దుబ్బాక ఉప ఎన్నికతో పాటు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో కేసీఆర్ పార్టీ తెరాస కు పూర్తి ప్రతికూల ఫలితాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యతిరేకత ఇలానే పెరుగుతూ పోతే రానున్న ఎన్నికలకు తెరాస పార్టీ కి ఇబ్బంది అవుతుందని కేసీఆర్ తన విధానాల్లో మార్పులు చేశారు..