ఏపీలో బీజేపీ తో పొత్తుల ఉన్న జనసేన పార్టీ కి ఇప్పుడిప్పుడే బీజేపీ అసలు స్వరూపం తెలుస్తుంది. బలం కోసమని బీజేపీ చెంత చేరితే బీజేపీ పార్టీ జనసేన తొక్కేసే విధంగా ప్లాన్ లు చేస్తుంది.. ఓ వైపు రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని శతవిధాలుగా ప్రయత్నిస్తుంది.. ఇప్పటికే టీడీపీ ని వెనక్కి నెట్టేయడంలో దాదాపు సఫలమయ్యింది. చంద్రబాబు కు మూడు చెరువుల నీళ్లు తాగించడంలో అధికార పార్టీ వైసీపీ కి బీజేపీ ఏమాత్రం మించిపోలేదు..