ఏపీలో జగన్ సీఎం అయ్యాక గ్రామీణ ప్రాంత ప్రజలు సంతోషంగా ఉన్నారు. దీనికి కారణం జగన్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలే... తను ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా ప్రజల ఇంటి ముందుకు చేరేలా చేయడంలో జగన్ సఫలం అయ్యాడు. అంతే కాకుండా నిరుద్యోగ సమస్యను కొంత వరకు పార దోలిన వాలంటీర్ వ్యవస్థ కూడా బాగా సక్సెస్ అయింది. ప్రజలందరూ ఇంతకు ముందు లాగా రోజుల తరబడి జరగని పనులను ఇప్పుడు రెండు మూడు రోజుల్లోనే జరిగేలా వాలంటీర్లు చూసుకుంటున్నారు.