ఏపీలో మధ్యపాన నిషేధం చేయడానికి సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అండ్ టీమ్ కంకణం కట్టుకుంది. ఎలాగైనా పేద కుటుంబాల్లో ఆశా జ్యోతిని వెలిగించాలని మద్యంపై సమర శంఖం పూరించింది ఏపీ ప్రభుత్వం. ఇంతకు ముందు వచ్చిన చాలా ప్రభుత్వాలు ప్రజల కోసం మధ్యపానాన్ని నిషేదిస్తామని చెప్పినప్పటికీ ఏవీ పూర్తిగా కార్యరూపం దాల్చలేదు.