ఒక్కొక్క వస్తువులపై పన్నులు విధిస్తూ... ఎడాపెడా భారం మోపుతూ వస్తున్న యూపీఏ సర్కార్ ఇప్పుడు జనంపై మరో దెబ్బ వేసేందుకు రంగం సిద్ధం చేసింది. మొన్నటి వరకు రైల్వే అధికారులు కేవలం ఏసీ, మధ్యతరగతి, రిజర్వేషన్ టిక్కెట్ల రేట్లు పెంచుతూ వచ్చారు. అయితే ఇప్పుడు ప్యాసింజర్ రైలు చార్జీలు పెంచక తప్పదని రైల్వే శాఖ మంత్రి పవన్‌కుమార్ బన్సల్ పార్లమెంట్‌లో ప్రకటించారు. రైల్వే వ్యవస్థను అభివృద్ధి దిశగా తీసుకుపోవడానికి చార్జీల పెంపు అనివార్యమని మంత్రి చెప్పారు. రైల్వేల భద్రతకు లక్ష కోట్ల రూపాయలు అవసరమని, ఇలాంటి పరిస్థితుల్లో చార్జీల పెంపు తప్ప మరో మార్గం లేదని... వనరులను సమకూర్చుకొని మెరుగైన సేవలందించడమే లక్ష్యమని చెప్పారు. ఎన్నో సంవత్సరాలుగా రైల్వే ప్రాజెక్టులు పూర్తికావడం లేదని, మరికొన్ని ప్రతిపాదనలకే పరిమితం అయ్యాయని, దేశవ్యాప్తంగా వీటి నిర్మాణానికి నాలుగు లక్షల కోట్లు అవసరమవుతాయని చెప్పారు. ప్రాజెక్టుల అమలు కోసం సభ్యులందరూ చార్జీల పెంపునకు పూర్తి మద్దతునివ్వాలని ఆయన కోరారు.సహకరించాలని బన్సల్ విజ్ఞప్తి చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: