కలసి ఉంటే కలదు సుఖం అన్న నిజాన్ని ఎట్టకేలకు కామ్రేడ్లు మళ్లీ తెలుసుకున్నారు. ప్రజల సమస్యలపై ఎప్పుడు కలిసి పోరాటాలు చేసే వామపక్షాల మద్య అనుకోని విధంగా విధాననిర్ణయాల్లో విభేదాలు వచ్చాయి.దీంతో కొంత కాలంగా విడివిడిగా ఆందోలనలు, ఎన్నికల్లో పోటీకి దిగిన సిపిఐ,సిపిఎంలకు రాష్ట్రంలోనే కాకుండా దేశంలోను ఛేదు అనుభవాలే ఎదురయ్యాయి.ఏదైనా అనుభవిస్తే కాని తెలియదంటారు...అంటే ఇదే మరి. ప్రపంచంలోనే అతి పెద్ద కమ్యూనిష్టుల కంచుకోట రష్యాలోనే బీటలు వారినా ,దేశంలోని పశ్చిమబెంగాల్ లో మాత్రం చాలా కాలం నిలబెట్టుకున్న మనకమ్యూనిష్టు పార్టీ చివరకు దానిని చేజార్చుకుంది. సిపిఐ,సిపిఎం లు కలసి ఒకే మాటపై ఉండడంతో దేశంలో సొంతంగా అధికారంలో లేకున్నా సంకీర్ణప్రభుత్వాల్లో చాలా కీలకంగా వ్యవహరించారు. అన్నదమ్ముల్లా ఉండే ఆరెండు పార్టీలు సఖ్యత కోల్పోవడంతో క్రమేపి ప్రాభవాన్ని కోల్పోవడం మొదలుపెట్టాయి. ఇక రాష్ట్రంలో ఆరెండు పార్టీలను ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయం వాటిని పూర్తిగా ఎడమొహం పెడమొహం పెట్టుకునేలా చేశాయి. సిపిఐ తెలంగాణకు అనుకూలంగా,సిపిఎం వ్యతిరేకంగా తమవిధానాన్ని ప్రకటించడంతో ఆరెండు పార్టీలనే కాదు ఎప్పుడు కలిసి మెలసి ఉండే క్షేత్రస్థాయిలోని నాయకులు, కార్యకర్తల మద్య కూడా అగాధాన్ని పెంచింది. వామపక్షాలకు లోక్ సభలోను, అసెంబ్లీ లోను అంతో ఇంతో ప్రాతినిధ్యాన్ని కల్పించేవి తెలంగాణలోని నల్గొండ,ఖమ్మం,ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలు. అందుకే సిపిఎం తెలంగాణకు నో అన్నా, సిపిఐ మాత్రం సై చెప్పి లాభం పొందాలని చూసింది. ఆరెండు పార్టీలు కలిసి సీట్లను పంచుకుని ఉమ్మడిగా పోటీచేస్తేనే వచ్చాయని, ఒంటరి పోరు చేసి ఛేదు అనుభవాలు చవిచూస్తే కాని వారికి తెలిసిరాలేదు. ఉమ్మడిగా చేసిన ప్రజాసమస్యలపై ఆందోలనలే వారికి సత్పలితాలిచ్చాయి. ఎట్టకేలకు విడిపోయి విరిగిన చేతులతో భాధపడవద్దనుకొని చేతులు కలిపారు. విద్యుత్ చార్జీల పెంపుపై చేసిన ఉమ్మడి ఆందోలన సక్సెస్ అయింది. మళ్లీ చాలాకాలం తర్వాత కలిసివేసిన తొలి అడుగును సచివాలయం ముట్టడితో రాష్ట్రరాజధాని నుంచే శ్రీకారం చుట్టారు.దీనికి భారీగా కార్యకర్తలు,నాయకులు రావడంతో ఆపార్టీకి చెందిన అందరిలో ఉత్తేజాన్ని నింపింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: