హైదరాబాద్: గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన రౌడీషీటర్ యాదగిరిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. ఓబులాపురం మైనింగ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న జనార్ధన్ రెడ్డికి బెయిల్ ఇప్పించడంలో రౌడీషీటర్ కీలక పాత్ర పోషించినట్లు సీబీఐ తేల్చింది. ఇప్పటికే దీనికి సంబందించి మాజీ జడ్జి పట్టాబి రామారావుతో సహా ఏడుగురిపై కేసు నమోదైంది. వీరిలో యాదగిరి ఒకరు. గత కొన్ని రోజులుగా తప్పించుకు తిరుగుతున్న ఆయన్ను ఆదివారం నాడు పొద్దు పోయాక నల్గొండ జిల్లాలో అరెస్టు చేశారు. యాదగిర్ని సోమవారం నాడు ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నారు. యాదగిరి అరెస్టుతో గాలి బెయిల్ కుంభకోణం కేసు కీలక మలుపు తిరిగే అవకాశం వుంది.
మరింత సమాచారం తెలుసుకోండి: