బాబు కేబినెట్‌లో అదృష్టవంతుడు ఎవరు అంటే ఖ‌చ్చితంగా మంత్రి నారాయణ పేరే ముందు చెప్పుకోవాలి. ఎలాంటి రాజకీయ అనుభవం లేకపోయినా, చట్టసభల్లో సభ్యుడు కాకపోయినా అదృష్టం కలిసి వచ్చి మంత్రి అయిపోయారు. ఐదేళ్ల పాటు నెల్లూరు జిల్లాలోనే కాకుండా ఇటు రాష్ట్ర రాజ‌ధాని వ్య‌వ‌హారాలు, రాజ‌ధాని భూముల విష‌యంలో కీల‌కంగా చ‌క్రం తిప్పే మంత్రిగా, చంద్ర‌బాకు అత్యంత న‌మ్మ‌క‌స్తుడిగా ఎదిగారు. ఈ ఎన్నిక‌ల్లో నెల్లూరు సిటీ నుంచి పోటీ చేయాల‌ని డిసైడ్ అయిన నారాయ‌ణ అందుకు రెండేళ్ల నుంచే అక్క‌డ గ్రౌండ్ వ‌ర్క్ చేసుకున్నారు. పుర‌పాల‌క శాఖా మంత్రిగా ఉండ‌డంతో నెల్లూరు న‌గ‌రంలో నిధుల‌న్ని కుమ్మ‌రించి కొంత వ‌ర‌కు అభివృద్ధి కూడా చేశారు. నారాయణ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహం చూపడంతో చంద్రబాబు సైతం ఆయనకు నెల్లూరు సిటీ సీటు కేటాయించారు. 


వాస్తవంగా చూస్తే నెల్లూరు జిల్లా మొత్తం మీద అ వైసిపి తిరుగులేని విధంగా బలోపేతంగా ఉంది. జిల్లాలో ఈ ఎన్నికల్లో టిడిపి ఒక‌టి అరా సీట్లు మినహా గెలిచే పరిస్థితి లేదు. నెల్లూరు సిటీలో వైసీపీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాద‌వ్ చాలా బ‌లంగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యూత్‌లో పార్టీ ప‌రంగా అనిల్‌కు మంచి క్రేజ్ ఉంది. అనిల్‌ను మామూలుగా ఓడించ‌డం క‌ష్టం. ఇదే విష‌యాన్ని గుర్తించిన నారాయ‌ణ ఈ సారి అక్క‌డ గెలిచేందుకు రూ.100 కోట్ల పెట్టుబ‌డి ఎన్నిక‌ల‌కు పెట్టారు. మామూలుగా అంత డ‌బ్బు పెడితే ప్ర‌త్య‌ర్థి గెలుపు క‌ష్ట‌మే అవుతుంది. అయితే నారాయ‌ణ ఇక్క‌డ గెలిస్తే పాతుకుపోతాడ‌ని భావించిన టీడీపీ వాళ్లే ఆయ‌న ద‌గ్గ‌ర డ‌బ్బు తీసుకుని... నొక్కేసి ఆయ‌న్ను ఓట‌మికి త‌మ వంతుగా క‌ష్ట‌ప‌డ్డార‌ట‌. ఈ విష‌యం ఇప్పుడు నెల్లూరులో బాగా హాట్ టాపిక్ అయ్యింది. 


ఆ మాటకు వస్తే ఇప్పుడు టీడీపీ నేతలే కాదు గతంలోనూ నెల్లూరు జిల్లాలో కొందరు సీనియర్లు ఇక్కడ వేరే వాళ్లు గెలిస్తే తమ పెత్తనానికి ఎక్కడ అడ్డు వస్తారో అని ఒకరికి ఒకరిని, సొంత పార్టీ నేతలనే ఓడించుకుంటూ ఉంటుంటారు. ఇక నారాయణ ఇక్కడ గెలిచేందుకు ఏకంగా రూ.100 కోట్ల‌ పెట్టుబడి పెడితే అందులో కేవలం 30 నుంచి 35 కోట్లు మాత్రమే జనాల దగ్గరకు చేరిందని మిగిలిన దాంట్లో  40 కోట్ల వరకు ఆ నలుగురు నేతలు నొక్కేనట్టు తెలుస్తోంది. వాస్తవంగా చూస్తే నెల్లూరు సిటీలో టిడిపి గత రెండు దశాబ్దాలుగా చాలా వీక్ అయిపోయింది. ఇక్క‌డ గ‌తంలో ఓ మాజీ మంత్రిపై నమ్మకం లేని చంద్రబాబు  గత ఎన్నికల్లో  కాంగ్రెస్ నుంచి అరువు తెచ్చుకున్న శ్రీధర‌కృష్ణారెడ్డికి సీటు ఇచ్చారు. కృష్ణా రెడ్డిపై అనిల్ కుమార్ ఘన విజయం సాధించారు. ఓ మాజీ మంత్రి, ఆయన భార్య  మరో మాజీ ఎమ్మెల్యే, నెల్లూరు నగరానికి సంబంధించిన మరో కీలక నేత కలిసి  నారాయణ ఓటర్లకు పంచమని ఇచ్చిన డబ్బులను వాళ్లు పంచుకున్నారట. 


ఎన్నికలు అయ్యాక అసలు విషయం తెలుసుకున్న నారాయణ మీరు నన్ను మోసం చేశారని వాళ్ల దగ్గర  తన ఆవేదన వ్యక్తం చేసినా... అప్ప‌టికే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది. ఫైన‌ల్‌గా నారాయ‌ణ డ‌బ్బు ఓట‌ర్ల ద‌గ్గ‌ర‌కు చేర‌లేదు. తీరా ఇప్ప‌డు ఎన్నిక‌లు కూడా అయిపోవ‌డంతో నారాయ‌ణ ఆ న‌లుగురి మీద ఎవ‌రికైనా ఫిర్యాదు చేద్దామ‌న్నా జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోవ‌డంతో సైలెంట్ అయిపోయిన‌ట్టు తెలుస్తోంది. ఇక నారాయ‌ణ డ‌బ్బు మొత్తం స్వాహా చెయ్య‌డానికి నెల్లూరు సిటీలో ఉన్న కార్పొరేట‌ర్లు సైతం ఓ చేయి వేసిన‌ట్టు తెలుస్తోంది. ఏదేమైనా ఎమ్మెల్యేగా గెల‌వాల‌న్న క‌ల‌తో రెండేళ్లుగా గ్రౌండ్ వ‌ర్క్ చేసుకుని అష్ట‌క‌ష్టాలు ప‌డి ఎమ్మెల్యేగా పోటీ చేసి, కోట్లు ఖ‌ర్చు చేసినా నారాయ‌ణ క‌ష్టాన్ని సొంత పార్టీ నేత‌లే మింగేశారు. పాపం నారాయ‌ణ అనుకోవాల్సిందేనా..!

మరింత సమాచారం తెలుసుకోండి: