గడచిన ఎన్నికల్లో ఘనవిజయాన్ని దక్కించుకున్నారు వైస్ జగన్మోహన్ రెడ్డి,ముఖ్యమంత్రి పదవి ప్రమాణ స్వీకారం నుండి చాలా చురుగ్గా రాష్ట్ర ప్రజల బాగోగులు చూస్తున్నారు అని ప్రజలు సీఎం జగన్మోహన్ రెడ్డి పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

వైస్సార్సీపీ పార్టీని నమ్ముకుని ఉన్న నాయకులు ఇప్పుడు ఉన్నతమైన పదవులలో ఉన్నారు అయితే ఇది గెలిచిన వారి పరిస్థితి మరి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళకు కూడా ఉన్నత పదవులు కట్టబెట్టే ఆలోచనలో ఉన్నారు ముఖ్యమంత్రి జగన్.తమ పార్టీ నాయకులకు పార్టీ కి చేసిన సేవలను దృష్టిలో పెట్టుకొని ఓడిపోయిన నాయకులకు ప్రభుత్వ పరిధిలో ఉన్న పదవులు అప్పగిస్తున్నారు.

వైస్సార్సీపీ సీనియర్ నేతల్లో ద్రోణంరాజు శ్రీనివాస్ ఒకరు.ఆయనకు సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక పదవి ఇచ్చారు. విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మెన్ గా ఆయనను నియమించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరఫున విశాఖ సౌత్ జోన్ నుండి పోటీచేసిన ద్రోణంరాజు... టిడిపి అభ్యర్థి గణేష్ కుమార్ వాసుపల్లి చేతిలో 3,279 ఓట్ల తేడాతో ఓడిపోయారు.


మరింత సమాచారం తెలుసుకోండి: